పోటీ తత్వాన్ని పెంపొందించుకోవాలి

పోటీ తత్వాన్ని పెంపొందించుకోవాలి

భూదాన్ పోచంపల్లి,ముద్ర: విద్యార్థులు చిన్నతనం నుండే పోటీ తత్వాన్ని పెంపొందించుకోవాలని పద్మశాలి యువజన సంఘం అధ్యక్షులు గంజి యుగంధర్ అన్నారు. బుధవారం భూదాన్ పోచంపల్లి పురపాలక కేంద్రంలోని డై హౌజ్ లో కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ,గౌతమి గ్రామర్ స్కూల్, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం, మోడల్ స్కూల్, శాంతినికేతన్, జిల్లా పరిషత్ బాలుర, బాలికల పాఠశాల, సరస్వతి విద్యా మందిర్, ఉషోదయ విద్యాలయం, లిటిల్ ఫ్లవర్ స్కూల్ విద్యార్థినీ విద్యార్థులకు  రామాయణం-నేటి యువతకు ఆదర్శం, స్వాతంత్య్రం-అమరవీరుల త్యాగాలు అనే అంశంపై వ్యాసరచన పోటీలను నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి పోటీల వల్ల విద్యార్థులకు ప్రతిభ ,నైపుణ్యం, పొట్టితత్వం పెంపొందించుకునేందుకు ఉపయోగపడుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్నం కృష్ణ కుమార్,వనం వెంకటేష్ ,పద్మశాలి యువజన సంఘం ఉపాధ్యక్షులు రుద్ర చందు, ప్రధాన కార్యదర్శి అడేపు అరవింద్,సహాయ కార్యదర్శి అటిపాముల దర్మెందర్,కోశాధికారి సూరపల్లి జగదీష్, సభ్యులు మధినాల మహేష్,ముషం శ్రీనివాస్,భోగ సాయి,చిలువెరు ఉదయ్,ఎలే శివ శంకర్, పట్టణ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు సీత సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.