కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వానికి నివేదికను సమర్పించిన కాగ్

కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వానికి నివేదికను సమర్పించిన కాగ్
  • ప్రాజెక్టు పనితీరుకు సంబంధించిన ఆడిట్ రిపోర్టును ప్రభుత్వానికి ఇచ్చిన అకౌంటెంట్ జనరల్
  • ప్రణాళికల నుంచి ఆర్థిక వనరుల సమీకరణ వరకు ఆడిట్ నిర్వహించిన కాగ్
  • బడ్జెట్ సమావేశాల్లో ఉభయ సభల్లో నివేదికను ప్రవేశపెట్టేందుకు వీలుగా నివేదిక

కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్ తెలంగాణ ప్రభుత్వానికి నివేదికను అందించింది. ఈ ప్రాజెక్టు పనితీరుకు సంబంధించిన ఆడిట్ రిపోర్టును ప్రభుత్వానికి సమర్పించినట్లు అకౌంటెంట్ జనరల్ వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ప్రణాళిక, పనులు, అంచనా వ్యయం, అనుమతులు, ఆర్థిక వనరుల సమీకరణపై కాగ్ ఆడిట్ నిర్వహించింది. రానున్న బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణ ఉభయ సభల్లో ఈ నివేదికను ప్రవేశపెట్టేందుకు వీలుగా నివేదికను ఇచ్చినట్లు అకౌంటెంట్ జనరల్ తెలిపారు.

కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అన్ని అంశాలపై కాగ్ ఆడిట్ నిర్వహించింది. పునరావాసం, డిజైన్ మొదలు టెండరింగ్ విధానం, వృథా ఖర్చు, చెల్లింపులు, అంచనాలు... ఇలా అన్నింటిపై ఆడిట్ చేసింది. అలాగే ఈ ప్రాజెక్టుపై లేవనెత్తిన అభ్యంతరాలు, గత ప్రభుత్వం ఇచ్చిన వివరణలతో కూడిన పూర్తి వివరాలను నివేదికలో పొందుపరిచింది.