కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా

కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా

పలువురికి తీవ్ర గాయాలు ఎంజీఎం కు తరలింపు
చిట్యాల ఏప్రిల్ 22 ముద్ర న్యూస్: జయశంకర్ భూపాలపల్లి జిల్లాచిట్యాల మండలం గుంటూరుపల్లి గ్రామంలో మిర్చి కళ్ళల్లో మిర్చి ఏరడానికి వెళ్లి ట్రాక్టర్ లొ తిరుగు ప్రయాణంలో బావు సింగ్ పల్లి ముచ్చినిపర్తి గ్రామల మధ్యలో  ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది.  అందులో ప్రయాణిస్తున్న సుమారు 36  మంది మిర్చి కూలీలు ఒక్కసారిగా కింద పడిపోయారు. అందులో పది మంది కూలీలకు తీవ్ర గాయాలు అయ్యాయి వెంటనే స్థానికులు గమనించి 108 వాహనంకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న 108 వాహనం చేరుకొని గాయాలైన మిర్చి కూలీలను చిట్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

వారికి ప్రధమ చికిత్స అందించి అనంతరం వారిని అక్కడ నుంచి వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన మిర్చి కూలీలు భూపాలపల్లి మండలం నేరేడుపల్లి, కాసిం పల్లి గ్రామానికి చెందిన వారిగా  స్థానికులు తెలిపారు.  పలువురు గాయాలైన కూలీలు వివరాలను అడుగగా మిర్చి ఏరి   తిరుగు ప్రయాణంలో ముచినిపర్తి, బావు సింగ్ పల్లి గ్రామాల మధ్య మూలమలుపు ఉండడంతో ఒక్కసారిగా ట్రాక్టర్ అదుపు తప్పి కింద పడ్డామని అందులో కొందరికి కాళ్లు, చేతులు విరిగాయని వెంటనే స్థానికులు గమనించి 108కు సమాచారం అందించడంతో ప్రాణాపాయం తప్పిందని కూలీలు తెలిపారు, డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉందని వారు తెలిపారు.