ఆవులను తరలిస్తున్న డీసీఎం పట్టివేత...ఇద్దరిపై కేసు నమోదు

ఆవులను తరలిస్తున్న డీసీఎం పట్టివేత...ఇద్దరిపై కేసు నమోదు

భూదాన్ పోచంపల్లి, ముద్ర:- అక్రమంగా తరలిస్తున్న గోవులను ఆదివారం భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని పిల్లాయిపల్లి గ్రామంలో పోలీసులు పట్టుకున్నారు. స్థానిక ఎస్ఐ భాస్కర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ లోని బహదూర్ పూరుకు చెందిన అశ్వక్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి 33 గోవులను కబెల్ కు  డీసీఎం లో తరలిస్తున్న క్రమంలో తెలంగాణ గోరక్షకతల సమాచారం మేరకు మండలంలోని పిల్లాయిపల్లి గ్రామంలో డీసీఎంను పట్టుకున్నామన్నారు. ఇందులో రెండు ఆవులు మృతి చెందాయని తెలిపారు. ఆవులను జియాగుడ గోశాలకు తరలించామని, డీసీఎం డ్రైవర్ బానావత్ అశోక్ తో పాటు అశ్వక్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

అనంతరం గో హింసకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏఎస్ఐ శంకర్ నాయక్ కు ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం ఎం శివకుమార్, జిల్లా గోరక్ష ప్రముఖ్ బల్ల దుర్వాసులు, పిల్లాయిపల్లి ఉపసర్పంచ్ పడాల సతీష్ చారి, భారతీయ జనతా యువమోర్చా మేడ్చల్ జిల్లా అధ్యక్షులు బండారి పవన్ రెడ్డి, టీటీడీ గోసంరక్షణ బోర్డు మెంబర్,గోరక్షదళ్ ఆల్ ఇండియా జనరల్ సెక్రెటరీ కోటి శ్రీధర్,భారతీయ జనతా యువమోర్చ మేడ్చల్ జిల్లా సెక్రెటరీ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి,ఘట్కేసర్ మండల ఉపాధ్యక్షులు శివాజీ ముఖేష్, నాయకులు నవీన్, భాను, చరణ్, తేజ రెడ్డి, బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు బడుగు శ్రీకాంత్, చిట్టిమల్ల ప్రవీణ్, కస్తూరి అనిల్ తదితరులు పాల్గొన్నారు.