మందుబాబు హాల్ చల్..ఏకంగా డ్యూటీ లో ఉన్న పోలీసుపైనే దాడి

ముద్ర,హైదరాబాద్:- హైదరాబాద్ అమీర్‌పేటలో ఓ మందుబాబు రెచ్చిపోయాడు.ఏకంగా విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్  పోలీసులపైనే దాడికి దిగాడు.నిన్న రాత్రి అమీర్‌పేటలో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు.ఇందులో పట్టుబడ్డ ఆటో డ్రైవర్ ఏకంగా పోలీసులపైనే తిరగబడ్డాడు.వారిని విచక్షణ రహితంగా బూతులు తిట్టాడు. ఓ పోలీస్ గొంతు పట్టుకుని కొట్టబోయాడు. దీనితో అక్కడ ఉన్నవారు అతడిని అడ్డుకున్నారు.