డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఇంట తీవ్ర విషాదం....

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఇంట తీవ్ర విషాదం....

ముద్ర,తెలంగాణ:- తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన సోదరుడు మల్లు వెంకటేశ్వర్లు కన్ను మూశారు. ఈ వార్త తెలిసిన వెంటనే భట్టి హుటాహుటినా వైరాకు బయలర్దేరారు. ఇక మల్లు వెంకటేశ్వర్లు గత మూడు నెలలుగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఆయనకు గచ్చిబైలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

హోమియో ఎండి చదివిన మల్లు వెంకటేశ్వర్లు ఆయుష్ శాఖలో ప్రొఫెసర్‌గా, అడిషనల్ డైరెక్టర్‌గా పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. ఆ తర్వాత వైరాలోని 1వ వార్డులో ఉన్న తన నివాసంలో హోమియో వైద్యశాలను నిర్వహిస్తున్నారు. ఇక ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగానే.. మూడు రోజుల క్రితం వెంకటేశ్వర్లుకి గుండెపోటు వచ్చినట్లు తెలిసింది. దాంతో ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించి మంగళవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో మృతి చెందారు.