పరుగులు పెడుతున్న రైల్వే స్టేషన్‌ పనులు

పరుగులు పెడుతున్న రైల్వే స్టేషన్‌ పనులు

 సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ పునరాభివృద్ది పనులు అక్టోబర్‌ 2025 నాటికీ పూర్తి చేయాలనే లక్ష్యంతో ముమ్మరంగా కొనసాగుతున్నాయి. భూసార పరీక్షకు సంబందించిన పనులు, స్థలాకృతి సర్వే పూర్తి చేసిన తర్వాత ప్రణాళికాబద్ధంగా నిర్మాణం ముందుకు సాగుతుంది. టోపోగ్రాఫిక్‌ సర్వే ఆధారంగా సైట్‌ లే అవుట్‌, సరిహద్దు నమూనా పనుల పురోగతిలో ఉన్నాయి, అప్‌గ్రేడ్‌ చేయబడిన స్టేషన్‌ బిల్డింగ్‌లో అధునాతనమైన హంగులతో బుకింగ్‌ కార్యాలయం ఉంటుంది.

ప్రస్తుతం ఉన్న స్టేషన్‌కు ఉత్తరం వైపు వచ్చే మల్టీ`లెవల్‌ కార్‌ పార్కింగ్‌కు అనుగుణంగా ప్రస్తుత బుకింగ్‌ కార్యాలయాన్ని తాత్కాలికంగా మార్చాల్సి ఉంది. తద్వారా ఇదివరకే ఉత్తరం వైపు ఉన్న ద్విచక్ర వాహనాల పార్కింగ్‌ గేట్‌ నంబర్‌ 3 సవిూపంలో ప్రత్యామ్నాయ ప్రదేశానికి (ఉత్తరం వైపునే) మార్చబడిరది. బుకింగ్‌ కార్యాలయం మార్చేందుకు తాత్కాలిక బుకింగ్‌ కార్యాలయం కోసం తవ్వకం పనులు వేగంగా సాగుతున్నాయని దక్షణ మధ్య రైల్వే ముఖ్య ప్రజాసంబంధాల అధికారి రాకేష్‌ ఒక ప్రకటనలో తెలిపారు.అదేవిధంగా పాత రైల్వే క్వార్టర్స్‌ను తొలగించిన తర్వాత, కొత్త ఆర్‌పీఎఫ్‌ కార్యాలయ నిర్మాణం కోసం పునాదుల తవ్వకం పనులు నడుస్తున్నాయి. పునరాభివృద్ధి పనిలో ముఖ్యమైన నిర్మాణ సామగ్రి కోసం కాస్టింగ్‌ యార్డ్‌, వర్క్‌ ఏరియాను ఏర్పాటు చేయడానికి మాత్రమే కాకుండా మెటీరియల్‌లను నిల్వ చేసేందుకు భూమిని కేటాయించారు.

ఇది సైట్‌  స్టేషన్‌ కు సామగ్రిని చేరవేసేందుకు సహాయపడుతుంది. కొత్తగా రూపుదిద్దుకోనున్న స్టేషన్‌ భవనానికి సంబంధించి ప్లాట్‌ఫాం, కవర్‌ ఓవర్‌ షెల్టర్‌ సంభావిత పైకప్పు నమూనా ఖరారు అయ్యింది. రైలు ప్రయాణికులకు ప్లాట్‌ఫాంలపై సదుపాయాలు కల్పించడమే కాకుండా, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించడానికి, ఆధునిక నిర్మాణాన్ని పొందుపరచడానికి కొత్త ఎలివేటెడ్‌ కవర్‌ రూపొందించబడిరది.రైల్వే మంత్రిత్వ శాఖ చేపట్టిన ‘‘ప్రధాన రైల్వే స్టేషన్‌ల పునరాభివృద్ధి’’లో భాగంగా సికింద్రాబాద్‌ స్టేషన్‌ను ఒకటిగా గుర్తించారు. దీని ప్రకారం ప్రపంచ స్థాయి సౌకర్యాలు, ఆధునిక ఆర్కిటెక్చర్‌తో సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ను పునరాభివృద్ది పనులు చేయడానికి ఇంజనీరింగ్‌ ప్రొక్యూర్మెంట్‌, కన్స్ట్రక్షన్‌ విధానంలో ఖరారు చేయబడిరది. ఈ పనులను అక్టోబర్‌ 2025 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ కీలక ప్రాజెక్టు పురోగతిపై ప్రతి దశలోనూ పర్యవేక్షిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌ కుమార్‌ జైన్‌ తెలిపారు. జోన్‌లో సికింద్రాబాద్‌ అతిపెద్ద స్టేషన్‌ అని, కొత్త పునరాభివృద్ది నిర్మాణం వల్ల స్టేషన్‌లో రైలు ప్రయాణికుల కోసం అన్ని ఆధునిక ఫీచర్లు ఉండేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. రాబోయే 40 ఏళ్ల అభివృద్ధి అవసరాలను దృష్టిలో ఉంచుకుని స్టేషన్‌ను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.