తెలంగాణ ప్రజల సౌకర్యార్థం అజ్మీర్​షరీఫ్​ దర్గావద్ద వసతి గృహం

తెలంగాణ ప్రజల సౌకర్యార్థం అజ్మీర్​షరీఫ్​ దర్గావద్ద వసతి గృహం
  • రెండు నెలల్లో పనులు ప్రారంభించనున్న సీసెం కేసీఆర్​
  • వెల్లడించిన హోంమంత్రి మహమూద్​ అలీ

ముద్ర, ముషీరాబాద్: తెలంగాణ ప్రజల సౌకర్యార్థం రాజస్థాన్​లో ప్రసిద్ధి గాంచిన అజ్మీర్​ షరీఫ్ దర్గా వద్ద వసతి గృహం నిర్మాణ పనులను రెండు నెల్లో సీఎం కేసీఆర్​ ప్రారంభిస్తారని రాష్ట్ర హోంశాఖమంత్రి మహమూద్​ అలీ తెలిపారు. ముషీరాబాద్​లోని ఏక్​మినార్​ చౌరస్తాలో బిఆర్ఎస్​ సీనియర్​ నాయకుడు ఎడ్ల హరిబాబు యాదవ్​ ఆధ్వర్యంలో రాష్ట్రంలో బిఆర్ఎస్​ మూడోసారి విజయం సాధించాలని, ముషీరాబాద్​లో మరోమారు గులాబి జెండా రెపరెపలాడాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలతో, మతసామరస్యంతో కసలి మెలసి ఉండాలని కోరుతూ రాజస్థాన్​ అజ్మీర్​షరీఫ్​ దర్గాకు సమర్పించనున్న మూడు చాదర్​లను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర హోంశాఖమంత్రి మహమూద్​అలీ, జహీరాబాద్​ ఎంసీ బీబీపాటిల్, ముషీరాబాద్​ ఎమ్మెల్యే ముఠా గోపాల్, ఎమ్మెల్యే అంజయ్య యాదవ్​లు పాల్గొని ప్రతేయక పార్థనలు నిర్వహించాచి వాటిని ప్రదర్శించారు. 

ఈ సందర్భంగా హోంమంత్రి మహమూద్​అలీ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో బిఆర్ఎస్​ పార్టీ వందకు పైగా సీట్లను సాధించి తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని ధీమావ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్​ పాలనలో దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో గంగా జమునా తహజీబ్​ కొనసాగుతోందన్నారు. అందుకే ఇక్కడ అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ప్రశాంతమైన జీవనాన్ని సాగిస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్​ బీజేపీలు ప్రజలను అసత్య ప్రచారాలతో మభ్యపెట్టి ఎన్నికల్లో ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్​ ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టి అమలు చేస్తున్నటువంటి అభివృద్ధి, సంక్షేమ పథకాలతో దేశవ్యాప్తంగా బిఆర్ఎస్​ పార్టీ పటిష్టమవుతుందన్నారు. ప్రజలంతా కలసిమెలసి ఐక్యంగా ఉండాలని కోరుకుంటూ మతసామరస్యాన్ని చాటేందుకు ఎడ్ల హరిబాబు యాదవ్​ చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్​ నాయకులు ఎం.ఎన్​.శ్రీనివాసరావు, సయ్యద్​ అహ్​మదుల్లా భక్తియార్, శివముదిరాజ్, శ్రీధర్​చారి, వై.శ్రీనివాసరావు, ముఠా జైసింహ, బల్లా ప్రశాంత్, ప్రభాకర్, ఉమామహేశ్వరి తదితరులు పాల్గొన్నారు.