చీఫ్​ సెలెక్టర్​గా అగార్కర్​?

చీఫ్​ సెలెక్టర్​గా అగార్కర్​?

ముంబై:  ప్రస్తుతం బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ పదవి ఖాళీగా ఉన్న సంగతి తెలిసిందే. ఒక ప్రముఖ వార్తా సంస్థకు మాజీ చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ అడ్డంగా బుక్కయ్యాడు. టీం సెలెక్షన్‌కు సంబంధించిన చాలా విషయాలను బయట పెట్టి తన ఉద్యోగం పోగొట్టుకున్నాడు. ఈ క్రమంలోనే సెలెక్షన్ కమిటీ సభ్యుడు ఎస్ఎస్ దాస్ తాత్కాలికంగా చీఫ్ సెలెక్టర్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. తాజాగా చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తులను బీసీసీఐ ఆహ్వానించింది. మాజీ క్రికెటర్లలో ప్రముఖులు ఎవరైనా ఈ పదవి చేపడితే భారత క్రికెట్‌కు చాలా మంచి జరుగుతుందని చాలా మంది అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో వీరేంద్ర సెహ్వాగ్ పేరు కూడా ప్రస్తావనకు వచ్చింది. అయితే ఇప్పుడు మాజీ దిగ్గజం అజిత్ అగార్కర్‌కు ఈ పదవి దక్కుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
చేతన్ శర్మ ఉద్వాసన తర్వాత సెలెక్షన్ కమిటీలో నార్త్ జోన్ నుంచి ఖాళీ ఉంది. ఈ క్రమంలోనే నార్త్ జోన్ ప్లేయర్ల నుంచి దరఖాస్తులు తీసుకున్నారు. వీరిలో షార్ట్ లిస్ట్ అయిన వారిని ఇంటర్వ్యూ చేసేందుకు క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) రెడీ అయింది. జట్టు మేనేజ్‌మెంట్‌తో ఏవైనా అభిప్రాయభేదాలు వస్తే.. వాళ్ల ముందు ధైర్యంగా నిలబడే వ్యక్తిని ఎంచుకోవాలని సీఏసీ అనుకుంటోందని బీసీసీఐ వర్గాలు చెప్తున్నాయి.

ఈ క్రమంలోనే భారత్ తరఫున మంచి రికార్డు ఉన్న అజిత్ అగార్కర్ పేరు బయటకు వచ్చింది. అంతర్జాతీయ కెరీర్‌లో భారత్ తరఫున ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్సులు ఆడిన అగార్కర్.. 2007లో టీ20 వరల్డ్ కప్ గెలిచిన జట్టులో సభ్యుడు. గతంలో కూడా అగార్కర్‌కు ఈ పదవి దక్కుతుందని వార్తలు వచ్చాయి. కానీ ఈసారి దాదాపుగా కన్ఫర్మ్ అయిపోయిందని టాక్. మరికొన్ని వారాల్లోనే చీఫ్ సెలెక్టర్ పదవిలో అగార్కర్ బాధ్యతలు స్వీకరిస్తాడని సమాచారం.
.