భువనగిరి గడ్డ కాంగ్రెస్ అడ్డ......

భువనగిరి గడ్డ కాంగ్రెస్ అడ్డ......

మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు సునీత రావు వెల్లడి.....

ఆలేరు (ముద్ర న్యూస్): రానున్న పార్లమెంటు ఎన్నికల్లో భువనగిరి పార్లమెంటు స్థానం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించి కేంద్రంలో రాహుల్ గాంధీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు మహిళా కాంగ్రెస్ శ్రేణులు కృషి చేయాలని రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావు పిలుపునిచ్చారు, శుక్రవారం నాడు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని వై ఎస్ ఎన్ ఫంక్షన్ హాల్ లో జరిగిన భువనగిరి పార్లమెంటు మహిళా కాంగ్రెస్ సమీక్ష సమావేశానికి జిల్లా అధ్యక్షురాలు నీలం పద్మ వెంకటస్వామి అధ్యక్షత వహించగా ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం మహిళలకు అన్ని రంగాలలో అవకాశం కల్పిస్తున్నామని గొప్పలు చెబుతూ నిరంతరం మహిళలపై వేధింపులు జరుగుతున్నాయని ఆరోపించారు, యుద్ధ ప్రాతిపదికన జిల్లా కమిటీలు, బ్లాక్ అధ్యక్షులు, మండల కమిటీ అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులు, వార్డు అధ్యక్షులు తమ కమిటీలను పూర్తిస్థాయిలో నియమించి క్షేత్రస్థాయిలో మహిళా కాంగ్రెస్ బలోపేతం కోసం కృషి చేయాలని సూచించారు, రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం 6 గ్యారంటీ లతోపాటు మహిళల అభివృద్ధి కోసం పెద్దపీట వేసిందని అన్నారు.

మహిళా మేనిఫెస్టో గురించి మహిళల అభిప్రాయాలను సేకరించి, రానున్న పార్లమెంటు ఎన్నికలలో మహిళలు అత్యధిక స్థానాలలో పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలని ఈ సందర్భంగా ఆమె పార్టీ అధినాయకత్వాన్ని కోరారు, రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ప్రకటించే కార్పొరేషన్ నియమకాలలో మహిళా కాంగ్రెస్ సేణులకు అధిక సంఖ్యలో కేటాయించాలని ఈ సందర్భంగా ఆమె ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు, ఈ కార్యక్రమంలో జనగాం జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఇందిరా, నల్లగొండ జిల్లా అధ్యక్షురాలు మాధవి, సిద్దిపేట జిల్లా అధ్యక్షురాలు లక్ష్మీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుష్పారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి పావని, నాయకురాలు ఆదిత, స్వప్న, పద్మ, సునీత తో పాటు పార్లమెంటు పరిధిలోని ఆయా జిల్లాలకు చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, కమిటీల సభ్యురాల్లు, మండల అధ్యక్షురాల్లు, పట్టణ అధ్యక్షురాల్లు, వార్డు అధ్యక్షురాళ్లతోపాటు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.