మానవ మనుగడ మొక్కలతో ముడిపడి ఉంది మాజీ కార్పొరేటర్ విఎస్ఆర్

మానవ మనుగడ మొక్కలతో ముడిపడి ఉంది మాజీ కార్పొరేటర్ విఎస్ఆర్

ముద్ర, ముషీరాబాద్: తెలంగాణ రాష్ట అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా సోమవారం బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కార్తీక్ యాదవ్ ఆధ్వర్యంలో ముషీరాబాద్ క్రాస్ రోడ్స్ లో హరితోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాంనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ వి.శ్రీనివాస్ రెడ్డి (విఎస్ఆర్) ముఖ్యఅతిథిగా హాజరై మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మానవ మనుగడ మొక్కలతో ముడిపడి ఉందని, ఆరోగ్యకరమైన వాతావరణంలో జీవించడానికి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సూచించారు.

పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యతగా గుర్తెరిగి మొక్కలు నాటాలని, భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణము అందించాలని చెప్పారు. సీఎం కేసీఆర్ హరితహారం పిలుపుతో రాష్ట్రం ఆకుపచ్చ తెలంగాణగా అవతరించిందని అన్నారు. వారి స్ఫూర్తితో హరితహారం కార్యక్రమాన్ని నిరాటంకంగా కొనసాగిస్తూనే ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు నాయిని దేవేందర్ రెడ్డి, బిక్షపతి యాదవ్, రేషం మల్లేష్, నేత శ్రీనివాస్, బుజ్జి వెంకటేశ్వరరావు, సిరిగిరి శ్యామ్, బాలరాజ్ గౌడ్, శ్రీనివాస్ యాదవ్, సిద్ధికి, తదితరులు పాల్గొన్నారు.