మల్యాల సింగల్ విండో చైర్మన్‌పై వీరిగిన అవిశ్వాస తీర్మానం

మల్యాల సింగల్ విండో చైర్మన్‌పై వీరిగిన అవిశ్వాస తీర్మానం

ముద్ర, మల్యాల : మల్యాల సింగిల్‌ విండో చైర్మన్‌ రామలింగారెడ్డి పై శనివారం అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. చైర్మన్‌ పై గత నెల పాలక వర్గ సభ్యులు అవిశ్వాసం ఏర్పాటు చేయాలని తీర్మానించి సంబంధిత డిప్యూటీ రిజిస్టార్‌కు నోటీసు అందజేశారు. నోటీసులు స్వీకరించిన రిజిస్టర్‌ శనివారం తొమ్మిది మంది డైరెక్టర్లు సమావేశానికి హాజరు కావాలని నోటీసులు అందజేశారు. దీంతో సహకార సంఘం అధికారి నిబంధనల మేరకు అవిశ్వాస సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కాగా ఒక్క డైరెక్టర్‌ కూడా సమావేశానికి హాజరు కాక పోవడంతో 11.00 గంటలకు చైర్మన్‌ పై అవిశ్వాసం వీగి పోయిందని ఆయన ప్రకటించారు. మరో ఏడాది పాటు అవిశ్వాసం పెట్టే అవకాశం లేదని రిజిస్టార్‌ తెలిపారు. ప్రస్తుతం చైర్మన్‌గా రామలింగారెడ్డి కొనసాగుతారన్నారు. కార్యక్రమంలో సహకార సిబ్బంది ఉన్నారు. ఈ ఎన్నికకు  సీఐ దామోదర్ రెడ్డి, ఎస్సై రహీం ఆధ్వర్యంలో పీఏసీఎస్‌ కార్యాలయం ఎదుట బందోబస్తు ఏర్పాటు చేశారు.

సహకార డైరెక్టర్లు:
సహకార సంఘంలో చైర్మన్‌, వైస్‌చైర్మన్‌లపై పెట్టిన అవిశ్వాసంపై జిల్లా అధికారి సత్యనారాయణ, అధికారులు ఏక పక్ష నిర్ణయం తీసుకుని అవిశ్వాసం వీగి పోయిందని చెప్పారని సహకార డైరెక్టర్లు అన్నారు. 12 గంటలకు తాము వచ్చామని, అప్పటికే అవిశ్వాసం వీగిపోయిందని చెప్పారని, డైరెక్టర్లు అన్నారు. అధికారి వేచి చూసిన సమయానికి రాకపోగా, సమయం దాటిన తర్వాత వస్తే చెల్లుబాటు కాదని తెలిపారు.