ఎండిన పంటలకు 25 వేలు నష్టపరిహారం, పంటలకు సాగు నీరు ఇవ్వాలి
- జడ్పీ చైర్ పర్సన్ వసంత, కోరుట్ల ఎమ్మేల్యే సంజయ్
ముద్ర ప్రతినిధి, జగిత్యాల:జిల్లాలో ఎండిన పంటలకు ఎకరాకు రూ. 25 వేలు నష్టపరిహారం, పంటలకు సాగు నీళ్ళు ఇవ్వాలని జడ్పీ చైర్ పర్సన్ దావా వసంత, కోరుట్ల ఎమ్మేల్యే డా. సంజయ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టరేట్ లో అడిషనల్ కలెక్టర్ రాంబాబు కోరుట్ల ఎమ్మెల్యే డా.సంజయ్, జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ వినతిపత్రం అందజేశారు.
ఈ సంద్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ నీటి నిర్వహణ, విద్యుత్ వైఫల్యమే పంట నష్టానికి కారణం అన్నారు. వంద రోజుల్లో చేస్తానన్న హామీలు వెంటనే అమలు చేయాలని,పంటలకు ఇస్తామన్న బోనస్ యాసంగి పంటలకు ఇచ్చి కొనుగోలు చేయాలన్నారు.కెసిఆర్ హయాంలో ఒక్క ఎకరా ఎండలేదు.. కాంగ్రెస్ వచ్చాకే పంటలు ఎండుతున్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నీళ్ళు తగ్గి రైతుల్లో కన్నీళ్లు పెరిగాయని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఉన్న మద్దతు ధరపై క్వింటాల్ కు బోనస్ గా అదనంగా రూ . 500 ఇస్తామని హామీ ఇచ్చారని, ఇప్పటివరకు దానిపై ఎలాంటి కార్యచరణ లేదన్నారు. త్వరగా ప్రభుత్వం రైతులను ఆదుకొని వారికి నష్టపరిహారం, మద్దతు ధరను ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ హరిచరణ్ రావు, మెట్ పెల్లి ఎంపీపీ సాయి రెడ్డి, కోరుట్ల మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు దారిశెట్టి రాజేష్, నాయకులు రాంరెడ్డి, సంపత్ తదితరులు పాల్గొన్నారు.