మల్యాల ఎంపీపీపై నెగ్గిన అవిశ్వాసం

మల్యాల ఎంపీపీపై నెగ్గిన అవిశ్వాసం

ముద్ర, మల్యాల:మండల పరిషత్ అధ్యక్షురాలు మిట్టపెల్లి విమల పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం మంగళ వారం నెగ్గింది. ఎంపీపీ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ఎంపీటీసీ లు గత మూడు నెలల క్రితం జగిత్యాల ఆర్డీవోకు వినతి పత్రం అందించారు. దీనిపై ఆర్థిఓ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని నోటీసు జారీ చేయగా, ఎంపీపీ విమల హైకోర్టు లో స్టే తెచ్చుకోవడంతో అవిశ్వాసానికి తాత్కలికంగా బ్రేక్ పడింది.

కాగా తిరిగి మంగళవారం అవిశ్వాస తీర్మానానికి అవకాశం కల్పించగా ఆర్జీవో మధుసూదన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవిశ్వాస తీర్మానంలో ప్రస్తుత ఎంపీపీ విమల కు వ్యతిరేకంగా 9 మంది ఎంపీటీసీలు చేతులు ఎత్తడంతో మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. మండలంలో 14 మంది ఎంపీటీసీలు ఉండగా ఈ సమావేశంలో 9మంది ఎంపీటీసీలు అవిశ్వాసానికి మద్దతుగా చేతులెత్తారు. దీంతో ఆర్టీవో మధుసూదన్ అవిశ్వాసం నెగ్గినట్లు ప్రకటించారు. అవిశ్వాస తీర్మానంలో టిఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపితో పాటు ఇండిపెండెంట్ ఎంపిటిసి సభ్యులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో స్వాతి, ఆర్ఐ తిరుపతి పాల్గొన్నారు. ఎస్ఐ కుమారస్వామి ఆధ్వర్యంలో బందోబస్త్ ఏర్పాటు చేశారు.