టవర్ సర్కిల్ మార్కెట్ ను సందర్శించిన మున్సిపల్ చైర్ పర్సన్ జ్యోతి 

టవర్ సర్కిల్ మార్కెట్ ను సందర్శించిన మున్సిపల్ చైర్ పర్సన్ జ్యోతి 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల పట్టణంలోని టవర్ సర్కిల్ ప్రాంతంలో ఉన్న ప్రధాన కూరగాయల మార్కెట్ ను మంగళవారం మున్సిపల్ చైర్ పర్సన్ ఆడువాల  జ్యోతి లక్ష్మణ్ సందర్శించారు. ఈ సందర్బంగా విక్రేతలు, కోనుగోలు దారులతో చైర్ పర్సన్ మాట్లాడి సౌకర్యాలు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు.   రోడ్డుపై సామాన్లు పెట్టి విక్రయించరాదని, ట్రాఫిక్ సమస్య లేకుండా చూడాలని దుకాణ యజమానులకు సూచించారు. ఆనంతరం మున్సిపల్ కార్మికుడు శ్రీహరి అనారోగ్యంతో హాస్పిటల్ లో  చికిత్స పొందుతుండగ కార్మికుడిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు.