నగరంలో ఆర్టీసీ బస్సుల ట్రిప్పులను తగ్గింపు...

నగరంలో ఆర్టీసీ బస్సుల ట్రిప్పులను తగ్గింపు...

ముద్ర,హైదరాబాద్:- ఎండల తీవ్రత దృష్ట్యా నగరంలో మధ్యాహ్నం సమయంలో బస్సుల సంఖ్యను తగ్గించనున్నట్లు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఈడీ వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. కొద్ది రోజులుగా పగటిపూట ఉష్ణోగ్రతలు బాగా పెరిగాయని, దీంతో ప్రయాణికుల సంఖ్య తగ్గుముఖం పట్టిందని పేర్కొన్నారు.ఈ మేరకు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నగరంలో సిటీ బస్సుల ట్రిప్పులను తగ్గించనున్నారు. ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు అన్ని రూట్లో బస్సులు యథావిధిగా రాకపోకలు సాగిస్తాయని అధికారులు పేర్కొన్నారు.