తెలంగాణలో మరో ఈవీ తయారీ కేంద్రం | Mudra News

తెలంగాణలో మరో ఈవీ తయారీ కేంద్రం | Mudra News
  • రూ.1000 కోట్ల రూపాయలతో  ఏర్పాటు
  • ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న మహీంద్రా కంపెనీ


ముద్ర, తెలంగాణ బ్యూరో: మహీంద్రా అండ్ మహీంద్రా తన లాస్ట్ మైల్ మొబిలిటీ ఎలక్ట్రిక్ వెహికల్ తయారీ కేంద్రాన్ని  తెలంగాణలో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం జహీరాబాద్ లో ఉన్న తన ప్లాంట్ కి అనుబంధంగా ఈ నూతన తయారీ ప్లాంట్ రానునట్లు తెలిపింది. కంపెనీ తెలంగాణ ప్రభుత్వంతో  గురువారం ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. ఇందులో భాగంగా 3 , 4 వీలర్ వాహనాలను తయారు చేయనున్నట్లు తెలిపింది. సుమారు వెయ్యి కోట్ల రూపాయలతో చేపట్టిన ఈ విస్తరణ ద్వారా వెయ్యి మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. భవిష్యత్తులోనూ ఎలక్ట్రిక్ వెహికల్, ఎనర్జీ స్టోరేజ్ సిస్టం తయారీ యూనిట్లను ఏర్పాటు చేసే అంశంలో తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సంసిద్ధంగా ఉన్నట్లు కంపెనీ తెలిపింది. దేశంలో సస్టైనబుల్ మొబిలిటీ రంగాన్ని మరింతగా వృద్ధి పరిచేందుకు మహీంద్రా కంపెనీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ సమావేశంలో  పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ పాల్గొన్నారు.