దుబ్బ రాజన్నకు పోటెత్తిన భక్తజనం.

దుబ్బ రాజన్నకు పోటెత్తిన భక్తజనం.
  • అంగరంగ వైభవంగా దుబ్బ రాజన్న రథోత్సవం
  • పాత్రికేయులను భారీకేడ్ల అవతల ఉంచిన పోలీసులు

సారంగాపూర్ ముద్ర: జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ దుబ్బ రాజేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం రథోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఆలయ అర్చకులు స్వామివారిని పల్లకి సేవలు కూర్చోబెట్టి అందంగా ముస్తాబు చేసి చావ తింపారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య రథంపై కూర్చోబెట్టి గుడి చుట్టూ ప్రధాన రహదారిపై రథోత్సవాన్ని భక్తులు శివనామ స్మరణతో లాగారు. రథోత్సవ కార్యక్రమంలో మాజీ హెడ్ కానిస్టేబుల్ మల్లయ్య వేసిన భక్తులను ఆకట్టుకుంది. అలాగే శివశక్తుల పూనకాలు ఆసాంతం రథం వెంబడి ముందుకు సాగాయి. ప్రధాన రహదారి వెంబడి పారిశుధ్య నిర్వహణ లోపం స్పష్టంగా కనబడింది. ఆలయ అధికారులు పారిశుధ్య  నిర్వహణలో విఫలమయ్యారని భక్తులు ఆరోపిస్తున్నారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు నిజామాబాద్ ఆదిలాబాద్ లక్ష మంది వరకు భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ వర్గాలు పేర్కొన్నాయి. రథోత్సవ కార్యక్రమానికి వెళ్ళిన పాత్రికేయులను పోలీసులు ప్రధాన రహదారి సమీపంలో ఏర్పాటు చేసిన భారీ కేడ్లు అవతల ఉంచి అవమానించడం పట్ల పాత్రికేయులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు భాగంగా కీలక ఘట్టమైన కార్యక్రమానికి వివిధ ప్రాంతాలను అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని గండ దీపం అభిషేకం అర్చన వంటి మొక్కలు చెల్లించుకున్నారు. వాసవి కన్యకా పరమేశ్వరి ఆధ్వర్యంలో భక్తులకు ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. జగిత్యాల రూరల్ సిఐ అరిఫ్ ఆలీ ఖాన్ ఆధ్వర్యంలో సారంగాపూర్ ఎస్సై తిరుపతి పర్యవేక్షణలో జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు.ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహణాధికారి వడ్లూరి అనూష ఫౌండర్ ట్రస్ట్ పోరండ్ల శంకరయ్య జెడ్ పి టి సి సభ్యులు మేడిపల్లి మనోహర్ రెడ్డి వైస్ ఎంపీపీ సొల్లు సురేందర్ వివిధ గ్రామాల ప్రజా ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు.