వాళ్లకి  నేనే టార్గెట్‌?

వాళ్లకి  నేనే టార్గెట్‌?

‘గురు’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన రితికాసింగ్ పర్సనల్ గా మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ తీసుకుంది. ఆమె రాసుకున్న ‘ఇరుది సుట్రు’ కథలో హీరోయిన్ కోసం వెతుకుతున్న క్రమంలో సుధా కొంగర రితికాని చూసి ఆడిషన్ చేసి సినిమాలో అవకాశం ఇచ్చారు. ఈ సినిమాతో తమిళ, తెలుగు భాషల్లో ఎంట్రీ ఇచ్చింది రితికాసింగ్. ఇదే సినిమా హిందీలో కూడా సాలాఖడూస్ గా రీమేక్ చేసి అక్కడ విజయం అందుకున్నారు. బాక్సర్ గా తన స్వీయ అనుభవం కూడా తోడై ఆ సినిమాకు బాగా సపోర్ట్ అందించింది రితిక. అందుకే మొదటి సినిమాతోనే ఫిల్మ్ ఫేర్ అవార్డు సైతం దక్కించుకుంది. ఆ తరువాత లారెన్స్ ‘శివలింగ’, ‘నీవెవరో’ సినిమాలతో పాటుగా ‘ఓ మై కడవులే’, ‘ఇన్కార్’ సినిమాల్లో నటించింది. సినిమాలే కాదు వెబ్ సీరీస్ లు కూడా చేసింది ఈ భామ. ఇండస్ట్రీలో ప్రశంసలతో పాటుగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయని అంటుంది. ఒకప్పుడు సోషల్ మీడియాలో తనను టార్గెట్ చేస్తూ ట్రోల్స్, డబుల్ మీనింగ్ డైలాగ్స్ చేశారని,  అవి తనని చాలా ఇబ్బంది పెట్టాయని చెప్పుకొచ్చింది. ఆడవారిని అందరు సమానంగా గౌరవించాలి అది సెలబ్రిటీ అయినా మిడిల్ క్లాస్ అయినా సమానంగా చూడాలని అంటుంది. ముఖ్యంగా అమ్మాయిలకు సెల్ఫ్ డిఫెన్స్ రావాలని అందుకు తగిన విధంగా తమని తాము మార్చుకోవాలని సలహా ఇస్తుంది రితిక. తన ప్రొఫెషన్ వేరైనా సరే సినిమాల్లోకి తెలియకుండా వచ్చిన రితిక ఇక్కడ ఎన్ని రోజులు ఉంటామన్నది చెప్పడం కష్టం. కానీ అవకాశం వచ్చినంతవరకు సినిమాలు చేస్తూనే ఉంటానని అంటుంది.