ఉద‌య‌నిధి స్టాలిన్‌పై అనుచిత వ్యాఖ్యలు.. హిందూ మున్నాని నేత అరెస్టు

ఉద‌య‌నిధి స్టాలిన్‌పై అనుచిత వ్యాఖ్యలు.. హిందూ మున్నాని నేత అరెస్టు

ముద్ర, తెలంగాణ బ్యూరో : తమిళనాడుకు చెందిన మంత్రి ఉద‌య‌నిధి స్టాలిన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు అర‌ణికి చెందిన హిందూ మున్నాని నేతను పోలీసులు అరెస్ట్ చేశారు. డీఎంకే జిల్లా చీఫ్ ఏసీ మ‌ణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హిందూ మున్నాని నేత మ‌హేశ్​ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 22న జ‌రిగిన వినాయ‌క చ‌వితి వేడుక‌ల సంద‌ర్భంగా మ‌హేశ్​అభ్యంత‌ర‌క‌ర వ్యాఖ్యలు చేశారు. కేసు నమోదు చేసుకున్న  అర‌ణి పోలీసులు మ‌హేశ్​ను త‌మ క‌స్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. కాగా, స‌నాత‌న‌ ధ‌ర్మంపై ఉద‌య‌నిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యల‌కు ఆయన క్షమాప‌ణ చెప్పాల‌ని మాత్రమే తాను కోరిన‌ట్టు మ‌హేశ్​త‌న వ్యాఖ్యల‌ను స‌మ‌ర్ధించుకున్నారు. ఈ నేపథ్యంలో సెక్షన్ 302కింద ఉద‌య‌నిధి స్టాలిన్‌పై చ‌ర్యలు చేప‌ట్టాల‌ని తాను డిమాండ్ చేశాన‌ని చెప్పారు. ఉద‌య‌నిధి త‌న వ్యాఖ్యల్లో నిర్మూలించాల‌నే ప‌దం వాడొద్దని అభ్యంత‌రం వ్యక్తం చేశారు.