మండిపోనున్న ఎండలు.. ఐఎండీ హెచ్చరికలు..

మండిపోనున్న ఎండలు.. ఐఎండీ హెచ్చరికలు..

న్యూఢిల్లీ: ఈసారి ఎండలు మండిపోనున్నాయని భారత వాతావరణ శాఖ ఐంఎండీ మంగళవారం హెచ్చరికలు జారీ చేసింది. గ్లోబల్​ వార్మింగ్​, కాలుష్యతీవ్రతలో పెరుగుదల, వాతావరణంలో నెలకొన్న అసమానతల వల్ల ఎండలు విపరీతంగా ఉండే అవకాశం ఉందన్నాయి. వర్షాలు కూడా భారత్​లో ఈ యేడాది సమృద్ధిగా కురిశాయి. ఎన్నడూ లేనంతగా పలు ప్రాజెక్టులను, నగరాలను, గ్రామాలను, చెరువులను, కుంటలను ముంచెత్తాయి. ఇక చలి విషయానికి వస్తే కూడా ఈ యేడాది చలితీవ్రత ఉత్తరాదితోపాటు దక్షిణాదిని కూడా నిన్నమొన్నటివరకూ వణికించింది. జమ్మూకశ్మీర్​లోని పలు ప్రాంతాల్లో ఇప్పటికీ మంచు కురుస్తుండగా, త్వరలోనే వాతావరణంలో మార్పు చోటు చేసుకుంటుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇక ఉత్తరాది, దక్షిణాది రాష్ర్టాల్లో ఎండల కారణంగా సముద్రంపై నుంచి వీచే గాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందన్నారు. వేడిగాలుల తీవ్రత ఎక్కువ ఉండే ప్రాంతాల్లో ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అలాగే ఈయేడాది వాతావరణంలో 1.5 డిగ్రీల సెల్సియస్​ ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ఏది ఏమైనా ఎండలలో ముందస్తు జాగ్రత్తలే మేలని అధికారులు సూచించారు.