పంజాగుట్టలో కారు బీభత్సం...డ్రైవర్‌కు దేహశుద్ధి చేసిన స్థానికులు

పంజాగుట్టలో కారు బీభత్సం...డ్రైవర్‌కు దేహశుద్ధి చేసిన స్థానికులు

ముద్ర,హైదరాబాద్:-హైదరాబాద్ పంజాగుట్టలో మందు బాబు హల్ చల్ చేశాడు. మద్యం మత్తులో వేగంగా కారు నడుపుతూ వచ్చిన ఓ యువకుడు అడ్డు వచ్చిన వారిని ఢీకొడుతూ వెళ్లాడు. దీంతో ఆగ్రహానికి గురైన స్థానికులు.. అతి కష్టం మీద కారును వెంబడించి అడ్డుకున్నారు.మద్యం మత్తులో కారు డ్రైవ్‌ చేసిన వ్యక్తిని స్థానికులు చితకబాదారు.అనంతరం పంజాగుట్ట పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.