తిరిగిన ఊర్లు .. తెలిసినవాళ్లు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా ... బిఆర్ఎస్ అభ్యర్థి కడియం

తిరిగిన ఊర్లు .. తెలిసినవాళ్లు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా ... బిఆర్ఎస్ అభ్యర్థి కడియం

ముద్ర, స్టేషన్ ఘన్ పూర్: తిరిగిన ఊర్లు .. తెలిసినవాళ్లు ఉన్న స్టేషన్ ఘన్ పూర్ ను రాష్ట్రంలో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దెనుకు మరో మారు ఆశీర్వదించండి అని బిఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరి అభ్యర్థించారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం కొత్తపల్లి, తాటికొండ, జిట్టగూడెం. చిల్పూర్ మండలం గార్లగడ్డ తండా, ఫతేపూర్, కృష్ణాజి గూడెం, పల్లగుట్ట, నష్కల్ గ్రామాల్లో శనివారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాకముందు గ్రామాల్లో కరెంటు, సాగునీరు, త్రాగునీరు లేక ప్రజలు అల్లాడే వారన్నారు. గడిచిన తొమ్మిది  ఏళ్లలో ముఖ్యమంత్రి కెసిఆర్ దూరదృష్టం కరెంటు, త్రాగు, సాగునీటి సమస్యలు శాశ్వతంగా దూరమై గ్రామాలు పచ్చగా ఉన్నాయి అన్నారు.

దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయని అద్భుత సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను బిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తూ ఆదర్శ రాష్ట్రంగా నిలిచిందన్నారు. అమలుకు సాధ్యం కానీ హామీలు ఇచ్చే కాంగ్రెస్ ను, ఇచ్చిన హామీలు నెరవేర్చక ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తున్న బిజెపి మాటలు నమ్మితే ఆగమైపోతాం అనే విషయాన్ని ప్రజలు గుర్తించి బిఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటు వేయాలన్నారు. తాటికొండ - కొత్తపల్లి, పల్లగుట్ట - ఫతేపూర్ రోడ్లను ఆరు నెలలు డబుల్ రోడ్డులుగా మారుస్తానన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ కృష్ణారెడ్డి, దేవస్థానం చైర్మన్ శ్రీధర్ రావు, ఎంపీపీ సరిత బాలరాజు, వైస్ ఎంపీపీ లు సుధీర్ రెడ్డి, సరిత సర్పంచులు ఆనందం, ఉమాదేవి, తులసి, రూపుల నాయక్, మానస, స్వప్న, ఎంపీటీసీలు వెంకటస్వామి, నర్సింలు, నాయకులు నరేందర్, మధు సుధన్ రెడ్డి, బాలరాజు నాయకులు చేరాలు, ఆనందం, రత్నాకర్ రెడ్డి, గట్టేష్, మాజీ ఎంపీపీ జగన్మోహన్ రెడ్డి, రవి, బిక్షపతి, జక్కుల రాజయ్య, మారపాక ఇసాక్, మోడం స్వామి, బిక్షపతి, దాసు తదితరులు పాల్గొన్నారు.