లారీ ఎక్కిన రైలు ఇంజన్.. బెంగళూరు టు ఒరిస్సా

లారీ ఎక్కిన రైలు ఇంజన్.. బెంగళూరు టు ఒరిస్సా

ముద్ర, స్టేషన్ ఘన్ పూర్: పట్టాలపై వెళ్లాల్సిన రైలు ఇంజన్ లారీ ఎక్కింది. ఇదేంటి అనుకుంటున్నారా... అవును ఇది నిజమే. బెంగళూరు నుండి ఒరిస్సా కు ఈ రైలు ఇంజన్ ను లారీపై తరలిస్తున్నారు. 40 టైర్లతో కూడిన భారీ వాహనంపై ఈ రైలు ఇంజన్ ను తరలిస్తున్నారు. బెంగళూరు నుండి ఒరిస్సా కు వెళ్లే ఈ వాహనం జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మీదుగా వెళుతుండడం లారీ ఎక్కిన రైల్ ఇంజన్ ను ప్రజలు ఆసక్తిగా చూశారు.