‘మత్స్య’ ఉత్సవాలను బహిష్కరిద్దాం- ఫిషర్మెన్ కాంగ్రెస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్

‘మత్స్య’ ఉత్సవాలను బహిష్కరిద్దాం- ఫిషర్మెన్ కాంగ్రెస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్

ముద్ర, తెలంగాణ బ్యూరో : దశాబ్ది ఉత్సవాల పేరుతో అధికార పార్టీ కొత్త డ్రామాకు తెరలేపిందని ఫిషర్మెన్ కాంగ్రెస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ అన్నారు. మత్సకారులను అధికార పార్టీ నిండా ముంచిందని ఆరోపించారు. ఆంధ్రావారికే చేప పిల్లల కాంట్రాక్టులు కేటాయిస్తున్నారన్నారు. చేప పిల్లల పంపిణీలో 30 శాతం కమీషన్ తీసుకుంటున్నారని మండిపడ్డారు. నాసిరకమైన చేప పిల్లల పంపిణీ ద్వారా మత్సకారులు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. కమీషన్ తీసుకోకుండా  మత్సశాఖ సొసైటీ లో సభ్యత్వం ఇవ్వడం లేదని విమర్శించారు. సొసైటీల అధికారాలను తగ్గించి నిర్వీర్యం చేసే ప్రయత్నం జరుగుతోందన్నారు. ఎనిమిదిన ప్రభుత్వం చేపట్టే చెరువుల పండుగను బహిష్కరించి నిరసన తెలపాలని మత్స్యకారులకు పిలుపునిచ్చారు.