కడియం వెంటే దళితులు.. వర్గాలు సృష్టిస్తే సహించం

కడియం వెంటే దళితులు.. వర్గాలు సృష్టిస్తే సహించం

ముద్ర, స్టేషన్ ఘన్ పూర్: నియోజకవర్గంలోని దళితులంతా కడియం వెంటే ఉన్నారని దళితుల మధ్య వర్గాలు సృష్టిస్తే సహించేది లేదని ఎస్సీ సెల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ కనకం రమేష్, కో కన్వీనర్ చాడ కుమార్ అన్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాలే శిరోధార్యంగా పనిచేసే టిఆర్ఎస్ శ్రేణులు ఎంతటి వారైనా పార్టీ ఆదేశాలకు కట్టుబడి పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. కొందరు నాయకులు వ్యక్తిగత, రాజకీయ లబ్ధి కోసం ఎమ్మెల్సీ కడియం శ్రీహరిని టిఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత రాజయ్యకే టిక్కెట్, బి ఫారం ఇవ్వాలని డిమాండ్ చేయడం వారి రాజకీయ అవివేకానికి నిదర్శనం అన్నారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా నియోజకవర్గ సమస్యల్ని ఎరిగి వాటిని పరిష్కరించే సత్తా ఉన్న కడియం శ్రీహరిని ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించుకుంటామన్నారు. పార్టీ ఆదేశాల మేరకు టిఆర్ఎస్ కార్యకర్తలంతా కడియం శ్రీహరి గెలుపుకు కృషి చేయాలని దళితులంతా ఆయన వెంటే ఉన్నారని దళితుల్లో వర్గాలు సృష్టించే కొందరు తమ పద్ధతిని మార్చుకోవాలని హెచ్చరించారు. ఈ సమావేశంలో నాయకులు గడ్డమీద వెంకటస్వామి, మంద రమేష్, తాటికాయల బాబు, రెడ పంగి సైదులు, చింత జోసెఫ్, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.