ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం మాదే..

ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం మాదే..
  • ప్రతిపక్షాల మాటలను ప్రజలు నమ్మరు
  • స్టేషన్‌ ఘన్‌ పూర్‌‌ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య 

ముద్ర ప్రతినిధి, జనగామ (రఘునాథపల్లి): తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షాలు చేస్తున్న అబద్ధపు ప్రచారాలను ప్రజలు నమ్మరని, రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తామే అధికారంలోకి వస్తామని మాజీ డిప్యూటీ సీఎం, స్టేషన్‌ ఘన్‌ పూర్‌‌ ఎమ్మెల్యే డాక్టర్‌‌ తాటికొండ రాజయ్య ధీమా వ్యక్తం చేశారు. బుధవారం జనగామ జిల్లా రఘునాథపల్లి మండల కేంద్రంలోని ఏఎస్ఆర్ గార్డెన్‌లో జరిగిన బీఆర్‌‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనానికి బీఆర్ఎస్ అధ్యక్షుడు వారాల రమేశ్‌ అధ్యక్షత వహించగా ఎమ్మెల్యే ముఖ్య​అతిథిగా హాజరై మాట్లాడారు. దేశంలో ఎక్కడలేనని సంక్షేమ పథకాలను తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారన్నారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు అసత్య ప్రచారాలు చేస్తున్నారని, వారి పురకార్లను తిప్పికొట్టేందుకు పార్టీ నాయకులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తెలంగాణపై వివక్షత చూపుతోందన్నారు. ప్రధాని మోడీ తెలంగాణ రాష్ట్రంపై కుట్రలు పన్నుతున్నారని, ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో గొడవలు సృష్టించేందుకు చూస్తున్నారని ఆరోపించారు. నియోజకవర్గంలో ప్రతి కార్యకర్తను గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జడ్పీటీసీ బొల్లం మణికంఠ అజయ్, బీఆర్ఎస్ మండల కార్యదర్శి అశోక్ 
ముసపట్ల, జనగామ మార్కెట్ కమిటీ చైర్మన్ సిద్ది లింగం, వైస్ చైర్మన్ ముసిపట్ల విజయ్, సోషల్ మీడియా ఇంచార్జి తిప్పారపు రమ్య బాబురావు, సునీత రాజు, శివకుమార్ గుప్తా, నామాల బుచ్చయ్య గౌడ్, మార్కెట్ డైరెక్టర్లు యాకస్వామి గౌడ్, శివరాత్రి రాజు, మాల రాజు, కొమురవెల్లి దేవస్థానం మాజీ అధ్యక్షుడు సేవెల్లి సంపత్, హైకోర్టు లాయర్ లోకుంట్ల సుజన్ కుమార్‌‌ పాల్గొన్నారు.