రాసలీలల రాజయ్య..

రాసలీలల రాజయ్య..
  • మాజీ డిప్యూటీ సీఎంపై కాంగ్రెస్‌ చార్జిషీట్‌
  • జిల్లాలో కలకలం రేపుతున్న కరపత్రాలు..

జనగామ/స్టేషన్ ఘన్ పూర్, ముద్ర: మాజీ డిప్యూటీ సీఎం, స్టేషన్ ఘన్‌ పూర్‌‌ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యపై ‘రాసలీలల రాజయ్య’ పేరుతో కాంగ్రెస్‌ పార్టీ విడుదల చేసిన చార్జిషీట్‌ స్థానికంగా కలకలం రేపింది. టీపీసీసీ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి పాదయాత్ర శుక్రవారం జనగామ జిల్లా స్టేషన్‌ ఘన్‌ పూర్‌‌కు చేరుకుంది. ఈ క్రమంలో లోకల్‌ ఎమ్మెల్యే అయిన తాటికొండ రాజయ్యపై కాంగ్రెస్‌ పార్టీ 9 అంశాలతో కూడిన కరపత్రం విడుదల చేసింది. అందులోని సారాంశం..ఇది..

  • అవినీతి ఆరోపణలతో డిప్యూటీ సీఎం పదవి నుంచి తొలగించబడ్డాడు. 
  • ఆదాయానికి మించి ఆస్తులు కూడ కట్టాడు. 
  • అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆడబిడ్డల పట్ల అనుచితంగా ప్రవర్తించి రాసలీల రాజయ్యగా మారాడు.
  • జఫర్‌‌గఢ్‌, ఖిలాషాపూర్ మండలాల ఏర్పాటులో రాజయ్య విఫలమయ్యాడు.
  • దళిత బంధు పేరుతో 30 శాతం కమీషన్ దోచుకున్నాడు.
  • కడియం వర్సెస్ రాజయ్య విభేదాలకు ఆజ్యం పోశాడు. 
  • డిగ్రీ కళాశాల, డబుల్ బెడ్ రూం ఇండ్లు, లెదర్ పార్క్ మొదలైన సమస్యలను పరిష్కారించలేదు.
  • ఫైర్ స్టేషన్ ఏర్పాటులో విఫలమయ్యాడు. 
  •  ప్రజల భద్రతపై రాజయ్యకు శ్రద్ధ లేదు.. పరిపాలనపై పట్టులేదు... అంటూ విడుదల చేసిన కరపత్రాలు ప్రస్తుతం జిల్లాలో చర్చనీయంగా మారాయి.