తుదిశ్వాస వరకు ప్రజల కోసమే పనిచేస్తా..

తుదిశ్వాస వరకు ప్రజల కోసమే పనిచేస్తా..
  • స్టేషన్‌ఘన్‌పూర్‌‌ ఎమ్మెల్యే డాక్టర్‌‌ రాజయ్య
  • అట్టహాసంగా లింగాలఘణపురం ఆత్మీయ సమ్మేళనం

ముద్ర ప్రతినిధి, జనగామ (లింగాలఘణపురం) :  ‘పిల్లల డాక్టర్‌‌గా నేను దేశంలోనే మంచి పేరు తెచ్చుకున్నా.. తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన నన్ను ప్రజలు నాలుగు సార్లు ఎమ్మెల్యే గెలిపించారు.. వారి దీవెనలు ఎన్నటికీ మర్చిపోను.. నా తుదిశ్వాస వరకు ప్రజల కోసమే పనిచేస్తాను..’ అంటూ స్టేషన్‌ఘన్‌పూర్‌‌ ఎమ్మెల్యే డాక్టర్‌‌ తాటికొండ రాజయ్య అన్నారు. శుక్రవారం జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం నెల్లుట్లలోని ఓ ఫంక్షన్‌ హాల్‌ జరిగిన పార్టీ ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే రాజయ్య, ఎంపీ పసునూరి దయాకర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌‌ పాలనలో రాష్ట్రం సస్యశామలం అయ్యిందని, స్టేషన్‌ఘన్‌పూర్‌‌ నియోజకవర్గంలో ప్రాజెక్టులు రాష్ట్రంలో ఎక్కడా లేవన్నారు.

లక్షా 20 వేల పంటలు ఎకరాల సాగవుతున్న ఏకైన నియోజకవర్గం తమదేనన్నారు. తెలంగాణ కోసం అప్పటి కాంగ్రెస్‌ పార్టీ, ఎమ్మెల్యే పదివి రాజీనామా చేసి వచ్చిన తతను ప్రజలు హక్కున చేర్చుకుని, ఈ తర్వాత వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారని గుర్తుచేశారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నానని చెప్పారు. రాబోయే రోజుల్లో మరింత కష్టపడి పనిచేస్తానని తెలిపారు. ఎంపీ దయాకర్‌‌ మాట్లాడుతూ కొన్ని పార్టీలు కావాలని బీఆర్‌‌ఎస్‌పై తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని, వాటి తిప్పికొట్టాలని కార్యకర్తలకు పిపునిచ్చారు. డాక్టర్‌‌ రాజయ్య నిత్యం ప్రజల్లో ఉండే నాయకుడని అలాంటి నేతను మనం కాపాడుకోవాలన్నారు.

ఆకట్టుకున్న ఆటా పాట...
ఆత్మీయ సమ్మేళనంలో కళాకారుల బృందం నిర్వహించిన ఆటా పాట అందరినీ ఆ కట్టుకుంది. కళాకారుల పాటలకు ఎమ్మెల్యే రాజయ్యతో పాటు లీడర్లు స్టేప్పులు వేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ గుడి వంశీధర్‌‌రెడ్డి, నియోజకవర్గ వర్క్స్ కమిటీ చైర్మన్ బొల్లంపల్లి నాగేందర్, మండల పార్టీ అధ్యక్షుడు బస్వగానీ శ్రీనివాస్, దిశ కమిటీ సభ్యురాలు భాగ్య, మాజీ ఎంపీపీ బోయిని రాజు, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు దూసరి గణపతి తదితరులు పాల్గొన్నారు. కాగా, సమ్మేళనంలో ఎంపీపీ చిట్ల జయశ్రీ ఉపేందర్‌‌రెడ్డి బర్త్‌ డే సందర్భంగా కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో ఆమెతో కేక్‌ కట్‌ చేయించి శుభాకాంక్షలు తెలిపారు.