కౌన్సిలర్ల ఇళ్లకు మునిసిపల్ నోటీసులు అతికింపు - మూడు సార్లు వాయిదా పడిన ఖానాపూర్ మున్సిపల్ సమావేశం

కౌన్సిలర్ల ఇళ్లకు మునిసిపల్ నోటీసులు అతికింపు - మూడు సార్లు వాయిదా పడిన ఖానాపూర్ మున్సిపల్ సమావేశం

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో మున్సిపల్ బడ్జెట్ ఆమోదం తతంగం రోజురోజుకు రక్తి కడుతున్నది. తాజాగా గురువారం రోజున బడ్జెట్ ప్రతులను కౌన్సిలర్ల ఇళ్లకు అతికించిన వైనం ఆసక్తిని కలిగిస్తోంది. నూతన ఆర్థిక సంవత్సరం కోసం ముని అధికారులు బడ్జెట్ రూపకల్పన చేశారు. దీని ఆమోదం కోసం ఇప్పటివరకు మూడు పర్యాయాలు సమావేశాలు ఏర్పాటు చేశారు. అయితే గత బడ్జెట్ లెక్కలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేస్తూ కౌన్సిలర్లు సమావేశాలను బహిష్కరించారు. దీంతో నూతన బడ్జెట్ ఆమోదం జరగలేదు. చివరిగా ఈ నెల 31 శుక్రవారం బడ్జెట్ సమావేశాలు ఖరారు చేసి నోటీసులను కౌన్సిలర్ల ఇళ్లకు అతికించి వెళ్లారు. ఇలా అటు మునిసిపాలిటీ, ఇటు కౌన్సిలర్ల మధ్య వివాదం రసవత్తరంగా మారింది