నేరాల నియంత్రణకే కార్డన్ సెర్చ్

నేరాల నియంత్రణకే కార్డన్ సెర్చ్

బాసర, ముద్ర: నిర్మల్ జిల్లా బాసర మండలం కిర్గుల్ (బి)గ్రామంలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు భైంసా ఏఎస్పీ సుభాష్ కాంతిలాల్ పాటిల్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో భాగంగా కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఇందులో సరైన వాహన పత్రాలు లేని 112 బైకులు,4 ఫోర్ వీల్లర్స్, ఒక  ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ముథోల్ సిఐ వినోద్ మాట్లాడుతూ ప్రజల రక్షణ గురించి,ఎవరైనా కొత్త వ్యక్తులు గానీ, నేరస్తులు గానీ వచ్చి మీ గ్రామంలో షెల్టర్‌ తీసుకుంటున్నారా అనే విషయం అలాగే నేరాల నియంత్రణ, అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకే ఈ కార్డెన్ సెర్చ్ నిర్వహిస్తున్నామని అన్నారు.సైబర్ నేరాల గురించి రోడ్డు భద్రత గురించి స్థానిక గ్రామ ప్రజలకు వివరించారు.ప్రతి ఒక్క వాహన దారుడు తప్పని సరిగా సరైన వాహన పత్రాలను, హెల్మెట్ కలిగి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ముదోల్ సీఐ వినోద్ రెడ్డి, బాసర ముదొల్ ఎస్సై లు గణేష్, సాయికుమార్ ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.