డిజిటల్ సమాచారంతో దూసుకుపోతున్న ముద్ర

డిజిటల్ సమాచారంతో దూసుకుపోతున్న ముద్ర
  • ప్రజల సమస్యలు వెలికి తీయడంలో ముద్ర పత్రిక నిష్పక్షికంగా వ్యవహరిస్తుంది
  • పత్రికలు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధి లాగా ఉండాలి
  • మాజీ మంత్రి, సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ అసెంబ్లీ  ఇన్చార్జ్ రాంరెడ్డి దామోదర్ రెడ్డి

ముద్ర ప్రతినిధి సూర్యాపేట:-డిజిటల్ సమాచారంతో దూసుకుపోతున్న ముద్ర అనతి కాలంలోనే ప్రజాభిమానం చూరగొన్నదని,పత్రికలు ప్రజలకు ప్రభుత్వానికి వారధి లాగా ఉండాలని మాజీ మంత్రి, సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ  నియోజకవర్గ ఇన్చార్జ్ రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ముద్ర క్యాలెండర్ ను ఆవిష్కరించి మాట్లాడారు. గత కొన్ని సంవత్సరాలుగా ముద్ర పత్రిక ప్రజల అభిమానాన్ని చూరగొని డిజిటల్ రంగంలో దూసుకుపోతూ ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తూ ప్రజల అభిమానాన్ని, ఆప్యాయతను పొందింది అని చెప్పారు. ప్రజా సమస్యలను వెలికి తీయడంలో ముద్ర దినపత్రిక పారదర్శకతతో వ్యవహరిస్తూ నిజాలను నిర్భయంగా నిక్కచ్చిగా ప్రపంచానికి తెలియపరుస్తుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కొప్పుల వేనారెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ లు డాక్టర్ బంటు కృష్ణ, పాల్వాయి జానయ్య, నాయిని శ్రీనివాసరావు, జనార్ధన చారి, శంకర్ , సైదులు, నజీర్, జహీర్,  రమేష్, పాషా, రాచకొండ రామచంద్ర రాజు, బాలు, ప్రవీణ్ అనిల్ తదితరులు పాల్గొన్నారు.