సిల్లీగా పరువాలు.. వడ్డిస్తున్న ఎల్లీ

సిల్లీగా పరువాలు.. వడ్డిస్తున్న ఎల్లీ

హాట్ కిల్లింగ్ లుక్స్ తో కుర్రకారులో బోలెడంత ఫాలోయింగ్ సంపాదించుకుంది స్వీడిష్ బ్యూటీ ఎల్లీ అవ్ రామ్. తనదైన అందం డ్యాన్సింగ్ నైపుణ్యంతో హృదయాల్ని గెలుచుకుంది.  కెరీర్ ఆరంభం పలు వీడియో ఆల్బమ్స్ లో అద్భుత నర్తకిగా పేరు తెచ్చుకుని అటుపై బాలీవుడ్ లోనే క్రేజీ డ్యాన్సర్లలో ఒకరిగా పాపులరైంది. వీటన్నిటినీ మించి నిరంతరం ఎఫైర్ వార్తలతో లైమ్ లైట్ లో నిలిచింది. టీమిండియా హార్డ్ హిట్టర్ హార్థిక్ పాండ్యాతో ప్రేమాయణం సాగించిన ఎల్లీ అప్పట్లో నిరంతరం మీడియా హెడ్ లైన్స్ లో నిలిచింది. చివరికి హార్థిక్  మరో విదేశీ బ్యూటీ నటాషా స్టాంకోవిచ్ ని  పెళ్లాడడంతో ఆ ఇద్దరిపైనా కథనాలకు ఫుల్ స్టాప్ పడింది. ఇటీవల బాలీవుడ్ లో అవ్ రామ్ స్పీడ్ తగ్గిందనే చెప్పాలి. 2022-–23 సీజన్ లో కేవలం రెండు హిందీ సినిమాల్లో మాత్రమే నటించగలిగింది. ఓ తమిళ చిత్రం చేసింది. అయితే సోషల్ మీడియాల్లో ఈ బ్యూటీ స్పీడ్ ఎప్పటిలానే కొనసాగుతోంది. నిరంతరం వేడెక్కించే ఫొటో షూట్లను షేర్ చేస్తూ అభిమానులకు టచ్ లో ఉంది. తాజాగా ఎల్లీ బికినీ బీచ్ లుక్ యువతరం గుండెల్ని మరిగించింది. కెరీర్ మ్యాటర్ కి వస్తే.. సల్మాన్ భాయ్ కెరీర్ ఆరంభమే 'బాడీగార్డ్' లాంటి హిట్ సినిమాలో కీలకపాత్రలో అవకాశం కల్పించాడు. అమీర్ తో స్పెషల్ నంబర్ లో నర్తించే అవకాశం దక్కించుకుంది. ఇటీవల అమితాబ్ బచ్చన్ తో కలిసి గుడ్ బైలో నటించింది. పియానో అనే హిందీ- ఇంగ్లిష్ ద్విభాషా చిత్రంలోనూ ఎల్లీ అవ్ రామ్ నటిస్తోంది. టైగర్ ష్రాఫ్ నటిస్తున్న గణపత్ పార్ట్ 1లో నటిస్తోంది. నానే వరుణన్ అనే తమిళ చిత్రంలోనూ నటించింది. ఎల్లీ మరోవైపు డ్యాన్స్ రియాలిటీ షోల జడ్జిగానూ బాగానే ఆర్జిస్తోంది.