విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ

విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ

ముద్ర.వీపనగండ్ల:-పరిధిలోని తూముకుంట జిల్లా పరిషత్ బాలుర, ప్రాథమిక పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులు స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు ఉపాధ్యాయులుగా వ్యవహరించి తోటి విద్యార్థులకు విద్యను బోధించారు. విద్యార్థి ఉపాధ్యాయులు కేటాయించిన సమయసారిక అనుసరించి తోటి విద్యార్థులకు బోధన చేయడం జరిగింది.

హెచ్ఎంగా ప్రమీల, విద్యాశాఖ మంత్రిగా చంద్రకళ ,కలెక్టర్ గా శైలజ, డిప్యూటీ కలెక్టర్గా  సాయికుమార్, డి ఈ ఓ గా భవాని , డిప్యూటీ డిఈఓ గా పావని, ఎంఈఓ గా శృతి , పీఈటీలుగా, ఆంజనేయులు, వినోద్, ప్రశాంత్, విధులు నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం మోహన్ గారు, సీనియర్ ఉపాధ్యాయులు తిరుమలేష్, కేశవులు, రాజు గౌడ్, పరశురాముడు, హుస్సేన్ జి, రమేష్, వెంకటేశ్వర్లు, సిఆర్పి నాగరాజు ,కృష్ణమ్మ, ఆద్య పాల్గొన్నారు. ప్రాథమిక పాఠశాలలో 19 మంది విద్యార్థులు ఉపాధ్యాయులుగా వ్యవహరించి పాఠాలు బోధించారు. ఉపాధ్యాయులు వ్యవహరించి ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులను అందజేశారు.కార్యక్రమంలో హెచ్ఎం శిరీష, ఉపాధ్యాయులు రాణి, క్రాంతి కుమార్, అరుణ, లక్ష్మి ఉన్నారు.