ఉచిత వైద్య శిబిరాలు ప్రజలకు దోహదపడతాయి : రూరల్ ఎస్సై సంతోష్ కుమార్

ఉచిత వైద్య శిబిరాలు ప్రజలకు దోహదపడతాయి : రూరల్ ఎస్సై సంతోష్ కుమార్

ముద్ర ప్రతినిధి భువనగిరి : ఉచిత వైద్య శిబిరాలు ప్రజలకు ఎంతో దోహదపడతాయని రూరల్ ఎస్సై సంతోష్ కుమార్ అన్నారు. మండలంలోని కూనూరు గ్రామంలో సంధ్య డెంటల్ క్లినిక్, కూనూరు ఎంపిటిసి పాశం శివానంద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత దంత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. డాక్టర్ సుధీర్ రెడ్డి  పర్యవేక్షణలో సాగిన ఈ క్యాంపులో సుమారు 200 మందికి పైగా ప్రజలకు వివిధ దంత సమస్యలకు సూచనలు చేసి మందులు అందించారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరికి బ్రష్ పేస్టు ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా ఎంపిటిసి పాశం శివానంద్ మాట్లాడుతూ దంత సంరక్షణ ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సై శివనాగప్రసాద్, కర్తాల శ్రీనివాస్, గోపి సుధాకర్, గుండ్ల శ్రీనివాస్, డోకే బాలకృష్ణ  పాల్గొన్నారు.