ఘనంగా శ్రీ వేంకటేశ్వర స్వామివారి రథోత్సవం...

ఘనంగా శ్రీ వేంకటేశ్వర స్వామివారి రథోత్సవం...

భారీగా తరలివచ్చి మొక్కలు చెల్లించుకున్న భక్తులు

వెల్గటూర్, ముద్ర: జగిత్యాల జిల్లా, వెల్గటూర్ మండలంలోని స్థంభంపల్లి గ్రామంలో  "శ్రీ వేంకటేశ్వర స్వామి" వారి రథోత్సవ కార్యక్రమం కన్నుల పండుగగా  జరిగింది. కాగా జగిత్యాల, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, సిరిసిల్ల, జిల్లాలలోని పలు గ్రామాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి కొబ్బరికాయలు కొట్టి, మొక్కలు చెల్లించుకున్నారు. భక్తులకు ఎ టువంటి ఇబ్బందులు కలగకుండా  ఆలయ కమిటీ చైర్మన్ నరేష్, సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు.  కాగా ఇక్కడ వారం రోజుల నుంచి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి  బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి.

 ఇందులో భాగంగా చివరి రోజు  ఆలయంలో గల "శ్రీ వెంకటేశ్వర స్వామి, పద్మావతి, అలివేలు మంగ" ఉత్సావ విగ్రహాలను పూలతో అందంగా అలంకరించిన  సేవ పై ఉంచి గంగపుత్రులు (బోయులు) ఆలయం కింద గల పెద్ద చెరువు వద్దకు తీసుకువచ్చారు. కాగా అక్కడ అప్పటికే రథాన్ని  వివిధ రకాల పూలతో అందంగా అలంకరించి సిద్ధంగా ఉంచగా, ఆలయ  అర్చకుడు" పవన్, అనంతస్వామి ఆధ్వర్యంలో  వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారిని  రథం పైకి ఎక్కించారు . కాగా అక్కడికి వచ్చిన భక్తులు రథాన్ని ముందుకు, వెనుకకు తోస్తూ రథోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాగా ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.