మిషన్ భగీరథ ప్లాంట్ ను సందర్శించిన ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి

మిషన్ భగీరథ ప్లాంట్ ను సందర్శించిన ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి 77  MLD  గౌరీదేవిపల్లి మిషన్ భగీరథ ట్రీట్మెంట్ ప్లాంట్ ని సందర్శించి , నీటి శుద్ధి ఎలా జరుగుతుందో మిషన్ భగీరథ అధికారుల ద్వారా అడిగి తెలుసుకోవడం జరిగింది. ప్లాంట్ సందర్శన అనంతరం ఎమ్మెల్యే ప్లాంట్ నిర్వహణ  తీరుని ప్రశంసించండం జరిగింది .

ఈ ట్రీట్ మెంట్ ప్లాంట్ ద్వారా నాగర్ కర్నూల్ నియోజక వర్గం యొక్క  203   గ్రామాలు,ఒక్క మున్సిపాలిటీ మరియు  అచంపేట్ నియోజక వర్గం యొక్క 203  గ్రామాలు  , ఒక్క మున్సిపాలిటీ లకు మంచి నీటి సరఫరా జరుగుతుంది తెలిపారు...ఈ కార్యక్రమం లో మిషన్ భగీరథ ఈఈ  సుధాకర్ సింగ్ , డిఈఈ లు సురేష్ కుమార్ , భరత్ సింహ రెడ్డి , మరియు ఏఈఈ లు జిలాని , వినోద్ నాయక్  మరియు ఏజన్సీ నుండి జి ఎం ప్రకాష్ , వెంకట్ రెడ్డి లు కూడా పాల్గొన్నారు.