జూన్ 3 నుంచి టెన్త్‌ సప్లిమెంటరీ పరీక్షలు...

జూన్ 3 నుంచి టెన్త్‌ సప్లిమెంటరీ పరీక్షలు...

ముద్ర,తెలంగాణ:- తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదల అయ్యాయి. కాసేపటి క్రితమే అంటే ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల చేశారు విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ బు ర్రా వెంకటేశం. తెలంగాణ పదవ తరగతి పరీక్షలు 18.03.2024 నుండి 02.04.2024 వరకు నిర్వహించారు. ఈ పరీక్షలకు మొత్తము 5,05,813 మంది విద్యార్థులు హాజరు కాగా వారిలో 4,94,207 మంది విద్యార్థులు రెగ్యులర్ గా మరియు 11,606 మంది విద్యార్థులు ప్రైవేటుగా హాజరైనారు.

తెలంగాణ రాష్ట్రంలో నిర్మల్ జిల్లా అన్ని జిల్లాల కంటే 99.05 % ఉత్తీర్ణత సాధించి ప్రథమ స్థానములో ఉన్నదని చెప్పారు. అదే విధముగా తెలంగాణ రాష్ట్రములో వికారాబాద్ జిల్లా అన్ని జిల్లాల కంటే అతి తక్కువ శాతము అనగా 65.10 % సాధించి చివరి స్థానములో ఉన్నదన్నారు. ఇక జూన్ 3 నుండి 13వ తేదీ వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ బుర్రా వెంకటేశం.