సూర్యాపేట జిల్లాలో 85.99 శాతం పోలింగ్.

సూర్యాపేట జిల్లాలో 85.99 శాతం పోలింగ్.
  • 95.83 శాతం దివ్యాంగులు పోలింగ్.
  • కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎస్. వెంకట్రావ్.

ముద్ర ప్రతినిధి సూర్యాపేట:-జిల్లాలో శాసన సభా ఎన్నికల  పోలింగ్ కు ప్రజలు పూర్తిగా సహకరించారని పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎస్. వెంకట్రావ్ అన్నారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో  ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో యస్.పి. రాహుల్ హెగ్డే, ఆదనవు కలెక్టర్ సి.హెచ్. ప్రియాంక లతో కలసి కలెక్టర్ పాల్గొన్నారు. జిల్లాలో నాలుగు నియోజక వర్గాల వారీగా హుజూర్ నగర్ 214012 మంది , కోదాడ 206676 మంది, సూర్యాపేట 203624 మంది అలాగే 223496 మంది మొత్తం 847808 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని తెలిపారు. 3న జిల్లా అంతట మద్యం దుకాణాలు పూర్తి బంద్ ఉంటాయని excise శాఖ నిరంతరం పర్యవేక్షణ చేస్తుందని అలాగే 144 సెక్షన్ అమలులో ఉంటుందని అన్నారు. జిల్లా లో మోడల్ కోడ్ 5 వరకు అమలులో ఉంటుందని ఉల్లంఘనలు జరిగితే కేసులు నమోదు చేయడం జరుగుతుందని అన్నారు. జిల్లాలో పట్టుకున్న  6 కేసులకు సంబంధించిన నగదు రూ.12 లక్షల 97 వేల రూపాయలు సదరు బాధితులు ఆధారాలు తెస్తే సత్వరమే అందిస్తామని అన్నారు. కౌంటింగ్ రోజున ర్యాలీలు నిర్వహణ చేపట్టారాదని ఈ సందర్బంగా తెలిపారు.  

అనంతరం యస్.పి. రాహుల్ హెగ్డే మాట్లాడుతూ పోలింగ్ కి పటిష్ఠ భద్రత కల్పించామని కౌంటింగ్ కి కూడా కట్టుదిట్టమైన భద్ర కల్పిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో 55 కేసులు నమోదు చేశామని  , జిల్లా అంతటా   144 సెక్షన్ అమలులో ఉంటుందని అలాగే రూ. 11 కోట్లు సీజ్ చేశామని అన్నారు. జిల్లాలో 3500 మంది పోలీసులు ఎన్నికల విధుల్లో ఉన్నారని సి.సి. కెమెరాల ఫుటేజీని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని కౌంటింగ్ రోజున ర్యాలీలు నిర్వహించ వద్దని,  మరుసటి రోజున ర్యాలీలకు అనుమతులు తీసుకోవాలని అన్నారు. పోలింగ్  న ప్రజలు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ ప్రతినిధులు సహకారం ఎంతో ఉందని ఈ సందర్బంగా అభినందించారు.

  • కౌంటింగ్ కి సర్వం సిద్ధం.
  • కట్టుదిట్టమైన ఏర్పాట్లు.

కౌంటింగ్ కి సర్వం సిద్ధం చేశామని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎస్. వెంకట్రావ్ అన్నారు. శనివారం ఏర్పాట్లపై ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో యస్.పి. రాహుల్ హెగ్డే, ఆదనవు కలెక్టర్ సి.హెచ్. ప్రియాంక లతో కలసి పాల్గొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ నాలుగు నియోజక వర్గాల  కౌంటింగ్ హాల్స్ నందు 14 టేబుల్స్ ఏర్పాటు చేశామని అలాగే మరో 12 టేబుల్స్ ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. కౌంటింగ్ సంబంధిత పరిశీలకుల సమక్షంలో జరుగుతుందని అన్నారు. మొదట పోస్టల్ బ్యాల్లెట్ లెక్కింపు తో ప్రారంభం ఉంటుందని తదుపరి ఉదయం 8.30 కి ఈవీఎంల లెక్కింపు జరుగుతుందని అన్నారు. కౌంటింగ్ కేంద్రాల్లో సెల్ ఫోన్ కు అనుమతి లేదని ఆదిశగా అందరూ సహకరించాలని అన్నారు. కౌంటింగ్ హాల్స్ లో సంబంధిత అధికారులు ద్వారా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ ప్రతినిధులు వెళ్లాలని అనుమతులు కల్పించనున్నట్లు  తెలిపారు. ఇప్పటికే కౌంటింగ్ సిబ్బందికి ప్రత్యేక తర్ఫీదు ఇచ్చామని విధుల నిర్వహణ సిబ్బంది అందరు ఉదయం 6.00 గంటలకు హాజరు కావాలని, 6.30 గం. లకు  కౌంటింగ్ ఎజెంట్లు వస్తారని, పోస్టల్ బ్యాలెట్ 8.00 గం. లకు మొదలవుతుందని అలాగే 8.30 గం. లకు evm ల కౌంటింగ్ ప్రక్రియ ఉంటుందని అన్నారు. అన్ని కౌంటింగ్ కేంద్రాల్లో సరిపడా సిబ్బంది, రూట్లు, లోపల గ్యాలరీలు, పోస్టల్ బ్యాలెట్ , వివిపాట్స్ విభాగాలు ఏర్పాటు చేశామని ఈ సందర్బంగా తెలిపారు. కౌంటింగ్ రోజున గెలిచిన అభ్యర్థుల ర్యాలీలు చేపట్టారాదని అలాగే మరుసటి రోజున ర్యాలీలు అనుమతులు తీసుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎం సి సి నోడల్ అధికారి సతీష్ కుమార్ డి పి ఆర్ ఓ ఏ రమేష్ కుమార్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.