జ్ఞాన సరస్వతి ఆలయంలో హనుమాన్ చాలీసా...

జ్ఞాన సరస్వతి ఆలయంలో హనుమాన్ చాలీసా...

ముద్ర,చొప్పదండి:చొప్పదండి పట్టణంలోని జ్ఞాన సరస్వతి ఆలయంలో  హనుమాన్ చాలీసా జ్ఞాన సరస్వతి సేవాదళ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం ముందు పలువురు భక్తులు హనుమాన్ చాలీసా ను పారాయణం చేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు సింహాచలం జగన్మోహన్ స్వామి, శ్రీ భాష్యం నవ్య కుమారులు వేదమంత్రచార మధ్య పూజా కార్యక్రమాలను నిర్వహించి భక్తులకు ఆశీర్వచనాన్ని అందించారు.