బ్యాగులో బాలుడి కిడ్నాప్..

బ్యాగులో బాలుడి కిడ్నాప్..

ముద్ర ప్రతినిధి కరీంనగర్ :  రెండేళ్ల బాలుడిని బ్యాగులో కుక్కి కిడ్నాప్ కు ప్రయత్నించిన మహిళ అడ్డంగా దొరికిపోయింది. రామడుగు మండలంలో పట్టపగలే కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. కరీంనగర్ రూరల్ మండలం రేకుర్తి గ్రామానికి చెందిన  వెంకటేశం - రేణుకల కుమారుడు  రాంప్రసాద్ తో కలిసి రామడుగులోని బంధువుల ఇంటికి వచ్చారు. ఆటోలో వెళుతున్న జల్లా రేణుక రోడ్డుపై ఆడుకుంటున్న బాలుడిని గమనించి మా బాబు అంటూ ఆటోలో ఎక్కించుకొని బ్యాగ్ లో పెట్టి  తీసుకెళ్తున్న క్రమంలో బాలుడు ఏడవడంతో తోటి ప్రయాణికులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు స్పందించి మహిళను అదుపులోకి తీసుకొని బాలుడిని రక్షించారు. మహిళపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనంతరం బాబును తల్లిదండ్రులకు అప్పగించారు.