ప్రతి నియోజకవర్గ కౌంటింగ్ కేంద్రంలో అబ్జర్వర్ల పరివేక్షణ..

ప్రతి నియోజకవర్గ కౌంటింగ్ కేంద్రంలో అబ్జర్వర్ల పరివేక్షణ..
  • సెల్ ఫోన్లు కు అనుమతి లేదు

ముద్ర ప్రతినిధి సూర్యాపేట:-కౌంటింగ్ కార్యక్రమాన్ని సిబ్బంది పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు. శనివారం సూర్యాపేటలోని మార్కెట్ యార్డ్ నందు మైక్రో అబ్జర్వర్లు, కౌంటింగ్ సూపర్వైజర్స్ కౌంటింగ్ అసిస్టెంట్లతో జరిగిన సమావేశంలో అబ్జర్వర్లు బాలకిషన్ ముండా, కౌశిగన్,ఐ. ఆనంద్ కుమార్, హిందోల్ దత్త తో కలిసి జిల్లా ఎన్నికల అధికారి సమావేశం నిర్వహించారు . ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి ఎస్ వెంకట్రావు మాట్లాడుతూ ఆదివారం సూర్యాపేట జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు కార్యక్రమం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుందని ముందుగా సర్వీస్ ఓటర్స్ లెక్కింపు ,తరువాత పోస్టల్ బ్యాలెట్ లను లెక్కిస్తారని జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియ ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలన్నారు. సిబ్బంది కౌంటింగ్ విధులకు వచ్చునపుడు జిల్లా ఎన్నికల అధికారి ఇచ్చిన ఆర్డర్ తో పాటు తమ ఐడి కార్డును తప్పక తీసుకొని రావాలని, అలాగే సిబ్బంది ఎవరు తమ సెల్ ఫోన్ లను కౌంటింగ్ కేంద్రంలోకి తీసుకొని రావద్దని జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు. ఉదయం కౌంటింగ్ హలు నందు సిబ్బంది విధులను అబ్జర్వర్లు థర్డ్ రాండమజైషన్ చేస్తారు. అనంతరం సిబ్బంది వారికి కేటాయించిన టేబుల్స్ వద్ద విధులు నిర్వహించాలని ఎన్నికల అధికారి తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియ అన్ని రాజకీయ పార్టీలకు చెందిన ఏజెంట్లకు కనిపించే విధంగా చేయాలన్నారు. మైక్రో అబ్జర్వర్లు రౌండ్ వైస్ డేటాను ఎప్పటికప్పుడు అందజేయాలన్నారు.

అబ్జర్వర్లు మాట్లాడుతూ సూర్యాపేట జిల్లాలో ఎన్నికల పోలింగ్ ప్రక్రియ అధికారులందరూ సిబ్బంది బాగా చేశారని  అభినందించారు. అలాగే కౌంటింగ్ పక్రియను కూడా జాగ్రత్తగా నిర్వహించాలని వారు తెలిపారు. ప్రతిపక్రియ ఎన్నికల నిబంధనలకు లోబడి ఉండాలని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా ఆంధ్రప్రభ కలెక్టర్ లోకల్ బాడీ సిహెచ్ ప్రియాంక అదనపు కలెక్టర్ రెవెన్యూ ఏ వెంకటరెడ్డి అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.