అక్రమ మధ్యమమ్మితే చర్యలు

అక్రమ మధ్యమమ్మితే చర్యలు
  • ఎక్సైజ్ సీఐ భాస్కరరావు

ముద్ర, స్టేషన్ ఘన్ పూర్: ఎన్నికల నియమావళి అమల్లో ఉన్న స్టేషన్ ఘన్ పూర్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో అక్రమంగా మద్యం అమ్మిన, నాటు సారాయి తయారు చేసే విక్రయించిన కఠిన చర్యలు తప్పవని ఎక్సైజ్ సీఐ భాస్కర్ రావు హెచ్చరించారు. గురువారం ఆయన ఇక్కడ మాట్లాడుతూ ఎన్నికల నియమావళి ప్రకారం గ్రామాల్లో తండాల్లో అక్రమంగా మద్యం అమ్మే వ్యక్తులపై చర్యలు తీసుకుంటామన్నారు. బెల్లం, పట్టిక అమ్మకాలు నాటు సారాయి ఉత్పత్తులు అమ్మకాలపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిన సందర్భంగా 100 లీటర్ల నాటుసారయి 200 కేజీల బెల్లము సీజ్ చేసి సదరు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఆయన వివరించారు. ఆయన వెంట ఎస్సై నరేష్, సిబ్బంది ఉన్నారు.