కార్యకర్తలు నిరుత్సాహ పడవద్దు ...

కార్యకర్తలు నిరుత్సాహ పడవద్దు ...
  • రాజకీయాల్లో గెలుపోటములు సహజం ....

ముద్ర, జమ్మికుంట: రాజకీయాల్లో గెలుపోటములు సహజమని కార్యకర్తలు ఎవరు నిరుత్సాహపడవద్దని 2024 లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు ,పార్లమెంటు ఎన్నికల్లో మన సత్తా ఏమిటో నిరూపించాలని హుజురాబాద్ మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు .బుధవారం జమ్మికుంట లో ఏర్పాటుచేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు .గత 20 సంవత్సరాలుగా హుజురాబాద్ నియోజకవర్గం ప్రజలు తనను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చారని అదేవిధంగా మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూడా కడుపులో పెట్టుకుంటారని ఆశించి పార్టీ నిర్దేశించిన ప్రకారం రాష్ట్రస్థాయిలో పర్యటించి బిజెపి అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేశానని తద్వారా నియోజకవర్గంలో ఎక్కువ శాతం దృష్టి సారించకపోవడం వల్లే ఓటమి తప్పలేదని దీనిని కార్యకర్తలు గమనించి రానున్న స్థానిక సంస్థలు ,పార్లమెంటు ఎన్నికల్లో బిజెపి పార్టీకి అత్యధిక స్థానాలు గెలుపొందే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త శక్తివంచన లేకుండా కృషి చేయాలన్నారు .

నీచునికి పట్టం కట్టడం దురదృష్టకరం ....

ఒక సైకో కి పట్టం కట్టడం దురదృష్టకరమని చైతన్యవంతమైన హుజురాబాద్ ఓటర్లు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని కౌశిక్ రెడ్డి పై నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు .20 ఏళ్ల తన రాజకీయ ప్రస్థానంలో ఏనాడు తన కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి రానివ్వకుండా తానే అన్ని అయి రాజకీయాల్లో గెలుపొందాలని కానీ నీచ రాజకీయాలకు తెరలేపిన కేసీఆర్ ఒక సైకో లాంటి కౌశిక్ రెడ్డిని నియోజకవర్గం అభ్యర్థిగా ప్రకటించడంతో ముక్కుపచ్చలారని పసికందును రాజకీయాల్లోకి తీసుకువచ్చి ఎన్నికల ప్రచారంలో పాలుపంచుకొని ఓట్లను అభ్యర్థించడం సిగ్గుచేటని కుటుంబ సభ్యులతో ఓట్లను ఆర్ధించిన కౌశిక్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలని లేనియెడల ప్రజలు ప్రజాక్షేత్రంలో తగిన గుణపాఠం చెప్తారని అన్నారు .

ప్రజలే నా బలం ...

నియోజకవర్గంలోని ప్రజలే నా బలమని అధికారంలో ఉన్న లేకపోయినా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ గతంలో లాగా ప్రజలకు ఏ ఇబ్బందులు ఎదురైన నన్ను సంప్రదించిన ఎడల మీ కష్టాలలో భాగమై తగిన న్యాయం చేస్తానని కార్యకర్తలకు ,ప్రజలకు హామీలు ఇచ్చారు .తన 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో చైతన్యవంతమైన గడ్డ హుజరాబాద్ గడ్డ మాత్రమేనని 2021లో జరిగిన ఉపఎన్నికతో హుజురాబాద్ పేరు ప్రపంచ యావానికపై తనదైన ముద్ర వేసిందని దీనికి సహకరించిన ప్రజలందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు .నీచ రాజకీయాలకు తెరలేపి దొడ్డి మార్గంలో అధికారంలోకి రావాలని చూసిన కేసీఆర్ ను ప్రజలు ఫామ్ హౌస్ దారి పట్టించారని దీనిని బారాస నాయకులు గుర్తెరిగి ప్రజలకు మంచి చేసే విధంగా రాజకీయాలు చేయాలని లేనియెడల ఎంతటి వారైనా ఓటమిరుగాక తప్పదని ఈటెల అన్నారు.e