మతిస్థిమితం లేక ఆస్తుల దానం...

మతిస్థిమితం లేక ఆస్తుల దానం...
  • తమ భూములు స్వీకరించవద్దని ఈవోకు విన్నపం...

ముద్ర, మల్యాల :కొండగట్టు అంజనేయస్వామి ఆలయాలలో ఈ నెల 27 న సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మండలం అల్లీపూర్ గ్రామానికి చెందిన కొప్పుర బాపురెడ్డి, కొడుకు అన్నం పెట్టడం లేదు. సరిగా చూసుకోవడం లేదని మనస్థాపం చెందిన తన ఆస్తి రెండు ఎకరాల ఇరవై గుంటల భూమికి సంబందించిన పత్రాలను బాండ్ పేపర్ తో సహా అధికారులకు సమర్పించగా, బుధవారం బాపురెడ్డి భార్య లక్మి, కుమారుడు ప్రవీణ్ తో కలిసి ఆలయ ఈవో కు లేఖ ద్వారా విన్నవించారు. తన తండ్రి మతిస్థిమితం లేక ఇలా చేశాడని, గత కొన్ని రోజులుగా వీరి వద్ద ఉండటం లేదని, తాత ముత్తాతల నుండి వస్తున్న ఆస్తి తన కుటుంబానికే చెందుతుందని కొడుకు లేఖలో పేర్కొన్నారు. అనంతరం ఆలయ ఈవో చంద్రశేఖర్ మాట్లాడుతూ.. గ్రామ పెద్దల సమక్షంలో నిర్ణయించిన తర్వాత తదుపరి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.