లోక్‌సభ ఎన్నికల నేపధ్యంలో ఈవీఎంలు,  వీవీ ప్యాట్ లపై అవగాహన 

లోక్‌సభ ఎన్నికల నేపధ్యంలో ఈవీఎంలు,  వీవీ ప్యాట్ లపై అవగాహన 

న్యూఢిల్లీ :త్వరలో జరుగనున్న  లోక్‌సభ ఎన్నికల నేపధ్యంలో  ఈవీఎంలు,  వీవీ ప్యాట్​కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్త అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించింది.   ఇందుకోసం దేవవ్యాప్తంగా 3500 కంటే ఎక్కువ ప్రదర్శన కేంద్రాలు ,  4250 మొబైల్ వ్యాన్లు  ఏర్పాటు చేసారు. పౌరులకు  ఓటింగ్ ప్రక్రియ మరియు యంత్రాలతో పరిచయం. అవగాహన కార్యక్రమంగా దీనిని ఉద్దేశించారు.  ప్రతి లోక్‌సభ మరియు రాష్ట్ర శాసనసభకు జరిగే ప్రతి సార్వత్రిక ఎన్నికలకు ముందు ​కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా  వీవీ ప్యాట్  స్లిప్ ద్వారా వారి ఎంపికలను ఎలా ధృవీకరించాలో ఓటర్లకు అవగాహన కల్పించారు.

కార్యక్రమంలో 3, 464 అసెంబ్లీ  కేంద్రాలు,  31 రాష్ట్రాలు/యూటీలలో (5 రాష్ట్రాలు కాకుండా ఇతర ప్రాంతాలలో) 613 జిల్లాల్లో విస్తరించిన నియోజకవర్గాలలో కార్యక్రమం నిర్వహిస్తున్నారు.  దేశంలోని  అన్ని రాజకీయ పార్టీలకు ఈ కార్యక్రమం గురించి తెలియజేసామని  ఎన్నికల సంఘం జాయింట్​ డైరెక్టర్​ అనూజ్ చందక్​  ఒక ప్రకటనలో తెలిపారు.