కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు అమలు చేయాలి 

కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు అమలు చేయాలి 
  • లేకుంటే ప్రజల తరఫున ఉద్యమం చేస్తాం
  • తనకు ఓటు వేసిన వారికి కృతజ్ఞతలు
  • విలేకరుల సమావేశంలో బిజెపి ఎమ్మెల్యే కాంటెస్ట్ అభ్యర్థి చందుపట్ల సునీల్ రెడ్డి

ముద్ర ప్రతినిధి పెద్దపల్లి: కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ పథకాల అమలు చేయాలని,  మంథనిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఎన్ని డబ్బులు ఖర్చు చేసిన నా మీద, పార్టీ మీద  నమ్మకం తో   ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కాంటెస్ట్ ఎమ్మెల్యే చంద్రుపట్ల సునీల్ రెడ్డి అన్నారు. 

మంథని పట్టణంలోని సొమవారం బీజేపీ పార్టీ ఆఫీస్ లో ఏర్పాటు చేసిన  సమావేశం లో సునీల్  రెడ్డీతో పాటు మాజీ ఎమ్మెల్యే చంద్రుపట్ల రాంరెడ్డి లు మాట్లాడుతూ అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, ఓటమి గల కారణాలను విశ్లేషణ చేసుకొని, పార్టీని బలోపేతం చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు హామీలు నెరవేర్చలేని పక్షం లో ప్రజల తరుపున పోరాటం చేస్తామన్నారు. మంథనిలో చిల్లర రాజకీయలకు  కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు తెరలేపారని, నేను శ్రీధర్ బాబు కి అమ్ముడు పోయానని బీఆర్ఎస్ నాయకులు, పుట్ట మధుకు  అమ్ముడు పోయానని కాంగ్రెస్ నాయకులు విష ప్రచారం చేశారని, కాని నన్ను నమ్మి ఓటు వేసిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటాను అన్నారు.  ఒక నీతి నిజాయతి గల పార్టీ బీజేపీ పార్టీ అని నమ్మిన సిదాంతం కొరకు పని చేస్తామని, ఒక్క రూపాయి కూడ  డబ్బు పరచలేదని సునీల్ రెడ్డి అన్నారు.  ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబెర్ కొండాపాక సత్యప్రకాష్, జిల్లా అధికార ప్రతినిధి పోతారవేణి క్రాంతికుమార్, కాటారం మండల అధ్యక్షులు బొమ్మన భాస్కర్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి లు పూసల రాజేంద్ర ప్రసాద్, బొల్లం కిషన్, మేడిపల్లి పూర్ణ చందర్, మండల ఉప అధ్యక్షులు రేపాక శంకర్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.