నూతన క్యాలెండర్ ఆవిష్కరించిన బాన్సువాడ డిఎస్పీ

నూతన క్యాలెండర్ ఆవిష్కరించిన బాన్సువాడ డిఎస్పీ

బాన్సువాడ, ముద్ర: తెలంగాణ స్టేట్ మైనారిటీ ఎంప్లాయిస్ సర్వీస్ అసోసియేషన్ (TS MESA) బాన్సువాడ డివిజన్ నూతన సంవత్సరం 2024 క్యాలెండర్ ను శనివారం బాన్సువాడ డి.ఎస్.పి జగన్నాథ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డి.ఎస్.పి జగన్నాథరెడ్డి  మాట్లాడుతూ మైనారిటీ ఉద్యోగుల సంఘం క్యాలెండర్  తన చేతుల మీదుగా ఆవిష్కరించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. టి ఎస్ మెసా సభ్యులు ఉద్యోగుల గురించే కాకుండా సమాజానికి ఉపయోగపడే మంచి కార్యక్రమాలు కూడా చేసి సంఘానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా టి ఎస్ మెసా డివిజన్ అధ్యక్షులు వహాబ్ మాట్లాడుతూ  మైనారిటీ ఉద్యోగుల సమస్యలపై అహర్నిశలు కష్టపడుతున్న తెలంగాణ రాష్ట్ర TS MESA అధ్యక్షులు ఫరూక్, అలాగే కామారెడ్డి అధ్యక్షులు బషీర్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం బాన్సువాడ అధ్యక్షులు సయ్యద్ వహాబ్, కార్యదర్శి సయ్యద్ హాజీ, కోశాధికారి సయ్యద్ అబ్దుల్ రజాక్, అసోసియేట్ అధ్యక్షులు ఖలీల్ అహ్మద్, యూనియన్ సభ్యులు తాహిర్ అలీ, కలీం, షోయబ్ అమేర్, రజాక్, అహ్మద్, అక్బర్, షాహిద్, విజయ్, మైనారిటీ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.