పల్లె బాట పట్టిన భాగ్యనగరం

పల్లె బాట పట్టిన భాగ్యనగరం

ముద్ర,తెలంగాణ:-సంక్రాంతి పండుగకు ఊళ్లకు వెళ్లే వాహనాలతో హైదరాబాద్‌ - విజయవాడ జాతీయ రహదారి సందడిగా మారింది.హైదరాబాద్‌ నుంచి సొంతూళ్లకు పండుగ కోసం ఆంధ్రప్రదేశ్కు వెళ్లే నగరవాసులతో వాహనాలు బారులు దీరాయి. ఇప్పటికే సెలవులు ప్రకటించడంతో శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్‌, పంతంగి టోల్‌ ప్లాజా వద్ద వాహనాల రద్దీ కనిపించింది. పండుగ నేపథ్యంలో శుక్రవారం రాత్రి వరకు 50 వేల వాహనాలు వెళ్లనున్నట్టు జీఎంఆర్‌ అధికారులు అంచనా వేస్తున్నారు.