పెద్దపెల్లి జిల్లాలో జోరుగా కొనసాగుతున్న బెల్టు షాపుల దందా...

పెద్దపెల్లి జిల్లాలో జోరుగా కొనసాగుతున్న బెల్టు షాపుల దందా...
  • పల్లెటూర్ లో ఒక్కో గ్రామంలో 5 నుండి10 వరకు వెలిసిన షాపులు...
  • బెల్ట్ షాపుల్లో కల్తీ మద్యం అమ్మకాలు... 
  • వైన్ షాపుల్లో ఒక రేటు బెల్ట్ షాపుల్లో అధిక రేటు
  • పట్టించుకోని జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారులు...
  • ఆగ్రహం వ్యక్తం చేస్తున్న జిల్లా మహిళలు, ప్రజలు


ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి: పెద్దపెల్లి జిల్లాలో జోరుగా కొనసాగుతున్న బెల్టు షాపుల దందా...జిల్లాలోని పల్లెటూర్ లో ఒక్కో గ్రామంలో 5 నుండి10 బెల్టు షాపులు వెలిశాయి... దీందో వైన్ షాపులు ఒకరేటు... బెల్ట్ షాపుల్లో అధిక రేటు తో మందు బాబులను అడ్డంగా దోసుకుంటున్నారు.  బెల్ట్ షాపుల్లో కల్తీ మద్యం అమ్ముతున్న పట్టించుకునే వారే లేరు. బెల్ట్ షాపులకు తీసుకొస్తున్న మద్యం కల్తి అవుతుందని, బెల్ట్ షాపులో బీరుకు రూ. 200 తీసుకుంటున్నారని... ఒక్కో బీరుకు 50 నుంచి 60 రూపాయల వరకు అధికంగా తీసుకుంటున్నారని అయినప్పటికీ బెల్ట్ షాపుల నిర్వాహకులను అడిగే వారే కరువయ్యారని గ్రామాల్లోని ప్రజలు వాపోతున్నారు.

వైన్ షాపులో ఒక్కో బీరు రూ. 150 రూపాయలు ఉండగా బెల్ట్ షాపుల్లో రూ. 200 పైన  అమ్ముతున్నారని, అలాగే ఫుల్ బాటిల్ మీద రూ. 200 అధికంగా తీసుకుంటున్నారని. దీంతో గ్రామాలలోని ప్రజలు తీవ్రంగా నష్టపోతున్న పట్టించుకున్న వారే కరువయ్యారు. బెల్ట్ షాపులలో కల్తీ మధ్య అమ్మి ప్రజల జీవితాలతో ఆటలాడుకుంటున్నారని మందు తాగిన తెల్లారి అనారోగ్యానికి గురవుతున్నామని మందుబాబులు తెలుపుతున్నారు.  బహిరంగంగా బెల్ట్ షాపులు ఏర్పాటు చేసి అధిక రేటుకు మద్యం కాలు కొనసాగుతున్న ఎక్సైజ్ శాఖ అధికారులు దాడులు చేయకపోవడం సిగ్గుచేటని మందుబాబులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్  స్పందించి సంబంధిత ఎక్సైజ్ శాఖ అధికారులు కు ఆదేశాలు జారీ చేసి గ్రామాల్లోని బెల్ట్ షాపులను నిషేధించాలని జిల్లాలోని ప్రజలు మహిళలు కోరుతున్నారు. లేకుంటే త్వరలోనే జిల్లా అంతటా ఆందోళన చేపడతామని ప్రజలు హెచ్చరిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బెల్ట్ షాపులను ఎత్తివేస్తామని హామీ ఇచ్చిందని. కానీ ఇప్పటివరకు బెల్ట్ షాపులకు ఎలాంటి ప్రకటన చేయకపోవడం విడ్డూరంగా ఉందని ప్రజలు వాపొతున్నారు ప్రభుత్వం వెంటనే బెల్టు షాప్ లను నిషేధించాలని ప్రజలు కోరుతున్నారు.